Sri Lanka: శ్రీలంక కీలక నిర్ణయం.. భారతీయులకు ఉచితంగా వీసాలు!

Sri Lanka approves visa free entry for visitors from India China Russia and four other countries
  • పర్యాటకాన్ని ప్రోత్సహించేందుకు శ్రీలంక చర్యలు
  • భారత్ సహా  8 దేశాల ప్రజలకు ఉచిత వీసాల జారీ
  • పైలట్ ప్రాజెక్టు కింద వచ్చే మార్చి 31 వరకూ కార్యక్రమం

దేశంలో పర్యాటకాన్ని ప్రోత్సహించేందుకు శ్రీలంక తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. భారత్, చైనా, రష్యా, మలేషియా, జపాన్, ఇండోనేషియా, థాయ్‌లాండ్ పౌరులకు ఉచితంగా వీసాలు జారీ చేసేందుకు నిర్ణయించింది. పైలట్ ప్రాజెక్టు కింద చేపట్టే ఈ కార్యక్రమం వచ్చే ఏడాది మార్చి 31 వరకూ కొనసాగుతుంది. ఈ మేరకు పర్యాటక మంత్రిత్వ శాఖ కీలక ప్రకటన చేసింది. ఉచిత వీసా కార్యక్రమానికి శ్రీలంక మంత్రివర్గం ఆమోదం తెలిపినట్టు వెల్లడించింది. ఈ చర్యతో పర్యాటకానికి ఊతం లభిస్తుందని తాము భావిస్తున్నట్టు శ్రీలంక పేర్కొంది. రాబోయే రోజుల్లో శ్రీలంకకు వచ్చే వారి సంఖ్య 5 మిలియన్లకు చేరుతుందని తాము ఆశిస్తున్నట్టు వెల్లడించింది. 

ద్వీప దేశమైన శ్రీలంక‌కు పర్యాటకం ప్రధాన ఆదాయవనరుగా మారిన విషయం తెలిసిందే. అయితే, 2020 నాటి కరోనా సంక్షోభం, ప్రభుత్వ తప్పుడు నిర్ణయాల కారణంగా దెబ్బతిన్న వ్యవసాయం వెరసి శ్రీలంకకు విదేశీ పర్యాటకుల రాకడపై ప్రతికూల ప్రభావం చూపించాయి. పరిస్థితిని సాధారణ స్థితికి చేర్చేందుకు నడుం కట్టిన శ్రీలంక ప్రస్తుతం పలు దిద్దుబాటు చర్యలు చేపడుతోంది.

  • Loading...

More Telugu News