Pakistan: అమెరికా అధ్యక్షుడి తొలగింపుతోనే వరల్డ్ కప్‌లో సెమీస్‌కు పాక్! నెట్టింట సెటైర్లు!

Pak fans troll their team amid diminishing chances of semis for pakistan
  • అడుగంటిపోతున్న పాక్ సెమీస్ ఆశలు
  • అభిమానుల్లో తీవ్ర నిరాశ 
  • సోషల్ మీడియా వేదికగా పాక్‌ జట్టుతో నెటిజన్ల చెడుగుడు 
వరల్డ్ కప్‌లో పేలవ ప్రదర్శనతో టోర్నీ నుంచి తప్పుకునే స్థితికి పాక్ వచ్చేసింది. ఇప్పటికే ఐదింట మూడు మ్యాచ్‌ల్లో పాక్ ఓడిపోయింది. మిగిలిన నాలుగు మ్యాచ్‌ల్లో వరుసగా గెలిస్తేనే సెమీస్‌కు చేరే అవకాశం. ఈ టోర్నీలో పసికూనలు కూడా దూసుకుపోతున్న వేళ తమ టీం చతికిలపడటంతో పాక్ అభిమానులు తీవ్ర నిరాశలో కూరుకుపోయారు. దీంతో, పాక్ విజయావకాశాలపై నెట్టింట సెటైర్లు పేలుతున్నాయి. పాక్‌కు సెమీస్‌లో కాలుపెట్టేందుకు ఉన్న అవకాశాలపై పెట్టిన ఓ పోస్ట్ ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. ఫరీద్ ఖాన్ పేరిట ఉన్న అకౌంట్లో ఈ పోస్ట్ కనిపించింది. 

ఈ పోస్ట్ ప్రకారం, పాక్ గెలవాలంటే..
తదుపరి జరిగే అన్ని మ్యాచ్‌లూ గెలవాలి
దక్షిణాఫ్రికాపై బంగ్లాదేశ్ విజయం సాధించాలి
నెదర్లాండ్స్‌ను భారత్ మట్టికరిపించాలి
ఆఫ్ఘనిస్థాన్ చేతిలో ఆస్ట్రేలియా ఓటమి పాలవ్వాలి
న్యూజిలాండ్ జట్టు ఫ్లైట్ మిస్సవ్వాలి
శ్రీలంక ఆటగాళ్లు తమ పాస్‌పోర్టు మర్చిపోయి ఉండాలి
ఇంగ్లండ్ జట్టు పొరపాటున మరో స్టేడియానికి వెళ్లాలి.
మైఖేల్ షూమేకర్ కోమా నుంచి బయటపడాలి
రాఫెల్ నడాల్ ఫ్రెంచ్ ఓపెన్ గెలవాలి
లూయిస్ హామిల్టన్ ఎఫ్1 టైటిల్ గెలవాలి
లివర్‌పూల్ ప్రీమియర్ లీగ్ విశ్వవిజేతగా అవతరించాలి
మాంచెస్టర్ యూనైటెడ్ ఛాంపియన్స్ లీగ్ టైటిల్‌ను సొంతం చేసుకోవాలి
జో బైడెన్‌ను అధ్యక్ష పదవి నుంచి తొలగించాలి. 
ఇవన్నీ జరిగితేనే పాక్ సెమీస్‌కు చేరుతుందంటూ వేసిన సెటర్ నెటిజన్లను బాగా అకట్టుకుంటోంది. 


Pakistan
India

More Telugu News