Cyclone Hamoon: తీవ్ర తుపానుగా మారిన హమూన్.. ఏడు రాష్ట్రాలకు హెచ్చరిక

  • ఈ ఉదయం 6 గంటలకు తీవ్ర తుపానుగా మారిన హమూన్
  • రేపు బంగ్లాదేశ్‌లోని ఖేపుపారా-చిట్టగాంగ్ మధ్య తీరం దాటే అవకాశం
  • జాలర్లు చేపల వేటకు వెళ్లొద్దని హెచ్చరిక
 Cyclone Hamoon intensifies into severe cyclonic storm

వాయవ్య బంగాళాఖాతంలో ఏర్పడిన ‘హమూన్’ తీవ్ర తుపానుగా మారినట్టు భారత వాతావరణశాఖ తెలిపింది. ఇది ఉత్తర-ఈశాన్య దిశగా కదిలి రేపు (బుధవారం) మధ్యాహ్నం బంగ్లాదేశ్‌లోని ఖేపుపారా-చిట్టగాంగ్ మధ్య తీరం దాటే అవకాశం ఉందని పేర్కొంది. ఈ నేపథ్యంలో ఒడిశా, పశ్చిమ బెంగాల్, మణిపూర్, త్రిపుర, అస్సాం, మేఘాలయ రాష్ట్రాలకు హెచ్చరికలు జారీ చేసింది. సముద్రం అల్లకల్లోలంగా ఉందని, జాలర్లు చేపల వేటకు వెళ్లొద్దని హెచ్చరించింది.

తెల్లవారుజామున 3 గంటల సమయంలో గంటకు 18 కిలోమీటర్ల వేగంతో హమూన్ తుపాను ఈశాన్యం దిశగా కదలడం ప్రారంభమైందని, 6 గంటలకు తీవ్ర తుపానుగా మారిందని ఐఎండీ తెలిపింది. ఒడిశాలోని పారాదీప్‌కు ఆగ్నేయంగా 200 కిలోమీటర్లు, పశ్చిమ బెంగాల్‌లోని దిఘాకు ఆగ్నేయంగా 290 కిలోమీటర్ల  దూరంలో వాయవ్య, దానిని ఆనుకుని ఉన్న పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కేంద్రీకృతమై ఉన్నట్టు వివరించింది.

More Telugu News