H1B Visa: హెచ్-1బీ వీసాలో అమెరికా చేసిన మార్పులివే.. పూర్తి వివరాలు ఇవిగో

  • మల్టిపుల్ ఎంట్రీలకు ముగింపు
  • హెచ్-1బీ జారీకి యాజమాని-ఉద్యోగి సంబంధం అవసరం లేదు
  • కీలక మార్పులను వివరించిన బాలసుబ్రమణి
these are big Changes As US Releases Proposed Tweaks To H 1B Process

నైపుణ్యాలు కలిగివున్న ఉద్యోగులు, విద్యార్థులు కోరుకునే హెచ్-1బీ వీసా ప్రోగ్రామ్ అగ్రరాజ్యం అమెరికా ఇమ్మిగ్రేషన్‌లో అత్యంత కీలకమైన అంశంగా ఉంది. అందుకే అధ్యక్షుడు జో బైడెన్ ప్రభుత్వం ఇటీవల కీలక ప్రతిపాదనలు చేసింది. ఈ కీలక మార్పులను యూఎస్‌లో ఉంటున్న రచయిత్రి సౌందర్య బాలసుబ్రమణి క్షుణ్ణంగా పరిశీలించి వివరించారు. 

ఇక మల్టిపుల్ ఎంట్రీలకు ముగింపు..
హెచ్-1బీ రిజిస్ట్రేషన్‌కు సంబంధించి ఇప్పటివరకు ఒకే ఉద్యోగి తరపున యాజమాన్య కంపెనీలు ఒకటికి మించి ఎంట్రీలు చేయాల్సి వచ్చేది. ఇపై ఈ విధానానికి ముగింపు పడనుంది. ఒక ఎంప్లాయి ఒక్కసారి నమోదు చేసుకుంటే సరిపోతుంది. పాస్‌పోర్ట్ సమాచారాన్ని యజమాన్య కంపెనీలు సమర్పించాల్సి ఉంటుంది. ఈ డేటాను యునైటెడ్ స్టేట్స్ సిటిజన్‌షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ ఎంపిక ప్రక్రియలో పరిశీలిస్తుంది.

యజమాని-ఉద్యోగి సంబంధం అక్కర్లేదు..
సొంత కంపెనీల ద్వారా హెచ్-1బీ వీసా పొందాలనుకునేవారికి ప్రధాన అవరోధం తొలగిపోయింది. ఇకపై వీసా కోసం యజమాని-ఉద్యోగి సంబంధం అవసరం లేదు. 2010లో తీసుకొచ్చిన ఈ నిబంధనను పక్కనపెట్టారు. వ్యవస్థాపకులకు అడ్డంకిగా మారుతుండడంతో దీనిని పక్కకు పెట్టారు.

జాబ్ ఆఫర్ వర్క్ ఫ్రమ్ హోం కూడా కావొచ్చు..
కరోనా మహమ్మారి తర్వాత ప్రపంచవ్యాప్తంగా అనుసరిస్తున్న వర్క్‌ ఫ్రమ్ హోమ్‌కు హెచ్-1బీ వీసా జారీలోనూ ప్రాధాన్యత దక్కింది. మంచి జాబ్ ఆఫర్‌ జాబితాలో టెలివర్క్, రిమోట్ వర్క్ లేదా ఇతర ఆఫ్-సైట్ వర్క్‌లు కూడా ఉండొచ్చని అమెరికా ఇమ్మిగ్రేషన్ గ్రీన్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ అంగీకరించింది.

ఆటోమేటిక్‌గా ‘క్యాప్-గ్యాప్’ పొడిగింపు..
అంతర్జాతీయ విద్యార్థులకు గణనీయమైన ఉపశమనం కలిగించే రూల్ ఇది. క్యాప్-గ్యాప్ ఆటోమేటిక్‌గా ఏప్రిల్ 1 వరకు పొడిగింపు కానుంది. పాత విధానం ప్రకారం ఎఫ్-1 ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ కింద క్యాప్ గ్యాప్‌ను అక్టోబర్ 1 వరకు మాత్రమే పొడిగించేవారు. అయితే ప్రతిపాదిత నిబంధనల ప్రకారం తదుపరి ఏడాది ఏప్రిల్ 1 వరకు లేదా హెచ్-1బీ వీసా పొందిన తేదీ వరకు ఏది ముందుగా వస్తే అంతవరకు పొడిగించవచ్చు.

మరింతగా పెరగనున్న కంపెనీల పరిశీలనలు..
మోసాలను ఎదుర్కోవడమే లక్ష్యంగా కంపెనీలు పనిచేస్తున్న ప్రదేశాల సందర్శనలను తనిఖీ చేయడం క్రమంగా పెరుగుతోంది. ముఖ్యంగా ఐటీ కన్సల్టింగ్ రంగంలో మోసాలను అరికట్టడం లక్ష్యంగా యూఎస్‌సీఐఎస్ ఈ మేరకు అడుగులు వేస్తోంది. ఇకపై ఈ విషయంలో మరింత కఠినంగా వ్యవహరించనుంది. యూఎస్‌సీఐఎస్ ఇన్‌స్పెక్టర్లు అకస్మాత్తుగా వెళ్లి అధికారులను ప్రశ్నించవచ్చు. రికార్డులను పరిశీలించవచ్చు. ఉద్యోగులతో మాట్లాడవచ్చు. హెచ్-1వీ ప్రోగ్రామ్ అవసరాలకు అనుగుణంగా వ్యవహరించాలని నిర్ణయించారు.

‘ప్రత్యేక వృత్తి’కి  కచ్చితమైన నిర్వచనం..
‘ప్రత్యేక వృత్తి’ నిర్వచనాన్ని అమెరికా కఠినతరం చేసింది. కొత్త నియమం ప్రకారం, అవసరమైన డిగ్రీ, సంబంధిత రోల్‌లో ఉద్యోగి నిర్వహించబోయే విధుల మధ్య ప్రత్యక్ష సంబంధం ఉండాలి. ఈ మార్పులతో అభ్యర్థులు మరిన్ని ఆధారాలు సమర్పించాల్సి రావొచ్చు. కొన్ని సందర్భాల్లో అర్హులైన వారు కూడా తిరస్కరణకు గురియ్యే అవకాశం లేకపోలేదు.

కొత్తరూల్స్‌పై భిప్రాయాన్ని తెలియజేయవచ్చు..
హెచ్-1బీ వీసాకు సంబంధించి ప్రతిపాదించిన మార్పులను అవసరమైతే పరిశీలించేందుకు అమెరికా సిద్ధంగా ఉంది. ఇందుకోసం డిపార్ట్‌మెంట్ ఆఫ్ హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ ‘పబ్లిక్ కామెంట్ పీరియడ్’ మొదలుపెట్టింది. డిసెంబర్ 22, 2023 వరకు వ్యక్తులు తమ అభిప్రాయాన్ని, సూచనలను అందించవచ్చు.

More Telugu News