Michael Vaughan: పాకిస్థాన్‌ను దారుణంగా ట్రోల్ చేసిన ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైఖేల్ వాన్

  • ఆఫ్ఘనిస్థాన్‌పై పాక్ ఘోర పరాజయం
  • పాక్ జట్టు డైరెక్టర్ మిక్కీ అర్థర్‌పై వాన్ విమర్శలు
  • ‘దిల్ దిల్ పాకిస్థాన్..’ గీతం ప్లే చేసి ఉండరంటూ ట్రోలింగ్
England Great Trolls Babar Azam And Co After Loss To Afghanistan

ఆప్ఘనిస్థాన్‌పై పరాజయంతో పాకిస్థాన్ జట్టు ఇంటాబయట తీవ్ర విమర్శలు ఎదుర్కొంటోంది. తాజాగా, ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైఖేల్ వాన్ పాకిస్థాన్‌ను దారుణంగా ట్రోల్ చేశాడు. పాక్ నిర్దేశించిన 283 పరుగుల విజయ లక్ష్యాన్ని ఆఫ్ఘనిస్థాన్ అలవోకగా ఛేదించింది. ఆ జట్టులోని ముగ్గురు ఆటగాళ్లు.. రహ్మతుల్లా గుర్జాజ్ (65), ఇబ్రహీం జద్రాన్ (87), రహ్మత్ షా (77) అర్ధ సెంచరీలు సాధించారు. ఆఫ్ఘన్ బ్యాటర్లపై పాక్ బౌలింగ్ తేలిపోయింది.

పాక్ దారుణ పరాజయంపై మైఖేల్ వాన్ ఎక్స్ ద్వారా స్పందిస్తూ.. ఈ నెల 14న అహ్మదాబాద్‌లోని నరేంద్రమోదీ స్టేడియంలో భారత్‌తో మ్యాచ్ సందర్భంగా పాక్ అనధికారిక జాతీయ గీతం ‘దిల్ దిల్ పాకిస్థాన్..’ను ప్లే చేయనందుకు ఆ జట్టు డైరెక్టర్ మిక్కీ అర్ధర్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. మ్యాచ్ సందర్భంగా తమకు మద్దతు లభించలేదని ఆవేదన వ్యక్తం చేశాడు. ఆయన వ్యాఖ్యలపై క్రికెట్ నిపుణులే కాదు, ఫ్యాన్స్ కూడా విమర్శలు చేశారు. తాజాగా, మిక్కీ వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ.. వాన్ ట్రోల్ చేశాడు. ‘‘ఈ రోజు చెన్నైలో ‘దిల్ దిల్ పాకిస్థాన్..’ ప్లే చేయలేదని అనుకుంటున్నాను’’ అని ఎద్దేవా చేశాడు.

More Telugu News