Balakrishna: అమెరికాలో అదరగొడుతున్న బాలయ్య సినిమా.. ఫుల్ ఖుషీలో ఫ్యాన్స్!

Balakrishna Bhagavanth Kesari movie entered in to 1 million dollars club in USA
  • బ్లాక్ బస్టర్ విజయం సాధించిన బాలయ్య 'భగవంత్ కేసరి' చిత్రం
  • అమెరికాలో నాలుగు రోజుల్లోనే 1 మిలియన్ డాలర్ల వసూళ్లు
  • యూఎస్ బాక్సాఫీస్ వద్ద హ్యాట్రిక్ కొట్టిన బాలయ్య
బాలయ్య సినిమా విడుదలైతే ఆ సందడే వేరు. ఇప్పుడు  మరోసారి ఆ సందడి వచ్చేసింది. బాలకృష్ణ, అనిల్ రావిపూడి కాంబినేషన్లో తెరకెక్కిన భగవంత్ కేసరి చిత్రం ఘన విజయం సాధించి, భారీ వసూళ్ల దిశగా దూసుకుపోతోంది. మరోవైపు అమెరికాలో కూడా ఈ చిత్రం అదరగొడుతోంది. ఈ సినిమా అక్కడ వన్ మిలియన్ డాలర్ల క్లబ్ లో చేరింది. ఈ విషయాన్ని నిర్మాతలు అధికారికంగా ప్రకటించారు. నాలుగు రోజుల్లో మిలియన్ డాలర్ల మార్క్ ను సాధించిందని... త్వరలోనే 1.5 మిలియన్ డాలర్ల క్లబ్ లోకి అడుగుపెడుతుందని వారు తెలిపారు. ఇప్పటికే బాలయ్య చిత్రాలు అఖండ, వీరసింహారెడ్డి అమెరికాలో వన్ మిలియన్ మార్క్ ను దాటాయి. భగవంత్ కేసరి ద్వారా బాలయ్య ఈ విషయంలో హ్యాట్రిక్ కొట్టారు. దీంతో నందమూరి ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు.
Balakrishna
Bhagavanth Kesari
Tollywood
USA

More Telugu News