Chandrababu: ములాఖత్‌‌లో చంద్రబాబుకు వివిధ అంశాలను వివరించిన లోకేశ్

Nara Lokesh briefs chandrababu about meeting with janasena in mulakhat
  • జనసేనతో నిర్వహించనున్న సమన్వయ కమిటీ సమావేశం అంశం వివరించిన తనయుడు
  • కరవు, కృష్ణా జలాల పంపిణీ పునఃసమీక్ష అంశాలనూ వివరించిన లోకేశ్
  • పెరుగుతున్న నిత్యావసర ధరలు, విద్యుత్ ఛార్జీల పెంపుపై దృష్టి సారించాలని లోకేశ్‌కు చంద్రబాబు సూచన
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ములాఖత్ సందర్భంగా తమ పార్టీ అధినేత చంద్రబాబు దృష్టికి వివిధ అంశాలను తీసుకు వెళ్లారని తెలుస్తోంది. జనసేనతో ఈ రోజు నిర్వహించనున్న సమన్వయ కమిటీ సమావేశం, అందులో చర్చించనున్న అంశాలను చంద్రబాబుకు వివరించారని సమాచారం. అలాగే కరవు, కృష్ణా జలాల పంపిణీ పునఃసమీక్ష వంటి ప్రజా సమస్యలను కూడా ములాఖత్ సందర్భంగా ఆయనకు వివరించారు.

దసరా సందర్భంగా ప్రజలను ఉద్దేశించి జైలు నుంచి విడుదల చేసిన లేఖపై వైసీపీ రాజకీయం చేస్తోందని కూడా చంద్రబాబుకు లోకేశ్ చెప్పారట. ఈ సందర్భంగా... నిత్యావసర ధరలు, విద్యుత్ ఛార్జీల పెంపు వంటి అంశాలపై దృష్టి సారించి, ప్రజల్లోకి వెళ్లాలని లోకేశ్‌కు చంద్రబాబు సూచించినట్లు సమాచారం. కాగా, ములాఖత్ అనంతరం లోకేశ్ పార్టీ ముఖ్యనేతలతో సమావేశమయ్యారు.
Chandrababu
Nara Lokesh
Telugudesam
Pawan Kalyan

More Telugu News