Kangana Ranaut: ఓటీటీ సెంటర్స్ లో ఈ వారమే 'స్కంద' .. 'చంద్రముఖి 2'

  • కంగనా ప్రధానమైన పాత్రను పోషించిన 'చంద్రముఖి 2'
  • ఈ నెల 26వ తేదీ నుంచి నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ 
  • రామ్ - బోయపాటి కాంబోగా వచ్చిన 'స్కంద'
  • ఈ నెల 27 నుంచి హాట్ స్టార్ లో అందుబాటులోకి
Chandramukhi 2 Movie Update

ఓటీటీ సెంటర్స్ లో ఒక వైపున సినిమాల పరంగా .. మరో వైపున సిరీస్ ల పరంగా ఈ వారం కూడా సందడి కాస్త గట్టిగానే కనిపించనుంది. అయితే తెలుగు నుంచి రెండు పెద్ద సినిమాలు ఈ వారం బరిలో కనిపిస్తున్నాయి. ఆ సినిమాలలో ఒకటి రామ్ హీరోగా చేసిన 'స్కంద' అయితే, మరొకటి కంగనా రనౌత్ ప్రధానమైన పాత్రలో నటించిన ' చంద్రముఖి 2'.కంగనా రనౌత్ - లారెన్స్ ప్రధానమైన పాత్రను పోషించిన 'చంద్రముఖి 2', సెప్టెంబర్ 28వ తేదీన థియేటర్లకు వచ్చింది. లైకా ప్రొడక్షన్స్ వారు నిర్మించిన ఈ సినిమాకి కీరవాణి సంగీతాన్ని అందించారు. థియేటర్ల నుంచి ఆశించిన స్థాయిని అందుకోలేకపోయిన ఈ సినిమా, ఈ నెల 26వ తేదీ నుంచి 'నెట్ ఫ్లిక్స్' వారు స్ట్రీమింగ్ చేయనున్నారు. ఇక సెప్టెంబర్ 28వ తేదీనే విడుదలైన 'స్కంద' సినిమా, డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో ఈ నెల 27వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది. శ్రీనివాస చిట్టూరి నిర్మించిన ఈ సినిమాకి బోయపాటి దర్శకత్వం వహించాడు. రామ్ సరసన శ్రీలీల నటించిన ఈ సినిమా, థియేటర్స్ కి వచ్చిన ప్రేక్షకులను సంతృప్తి పరచలేకపోయింది. ఇక ఓటీటీ వైపు నుంచి ఈ సినిమాలు ఎన్ని మార్కులు రాబడతాయనేది చూడాలి. 


More Telugu News