Tara Sutaria: అనుక్షణం ఆసక్తిని రేకెత్తించే 'అపూర్వ' .. డిస్నీప్లస్ హాట్ స్టార్ ఫ్లాట్ ఫామ్ పైకి మరో ఇంట్రెస్టింగ్ వెబ్ సిరీస్

  • నాయిక ప్రధానమైన సిరీస్ గా 'అపూర్వ'
  • టైటిల్ రోల్ ను పోషించిన తార సుతారియా 
  • అనూహ్యమైన మలుపులతో సాగే కథ 
  • నవంబర్ 15 నుంచి స్ట్రీమింగ్  
Apurva Webseries

డిస్నీ ప్లస్ హాట్ స్టార్ నుంచి ప్రేక్షకులను పలకరించడానికి 'అపూర్వ' వెబ్ సిరీస్ సిద్ధమవుతోంది. తార సుతారియా - అభిషేక్ బెనర్జీ .. రాజ్ పాల్ యాదవ్ ప్రధానమైన పాత్రలను పోషించిన ఈ సిరీస్ కి, నిఖిల్ నాగేశ్ భట్ దర్శకత్వం వహించాడు. ఫస్టులుక్ తోనే అందరిలో ఆసక్తిని పెంచిన ఈ సిరీస్, అప్ డేట్స్ తో ఆత్రుతను పెంచుతోంది.  

ఒక సాధారణమైన యువతి తనకి ఎదురైన అనూహ్యమైన పరిస్థితులను ఎలా ఎదుర్కొంది? అసాధారణమైన పరిణామాలను ఎలా తట్టుకుని నిలబడగలిగింది? అనేది ఈ కథలోని ప్రధానమైన అంశం. థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో సాగే ఈ సిరీస్, నవంబర్ 15 నుంచి డిస్నీ ప్లస్ హాట్ స్టార్ స్ట్రీమింగ్ కానుంది. 

ఇండియాలోని అత్యంత ప్రమాదకరమైన లొకేషన్స్ లో ఈ సిరీస్ ను చిత్రీకరించినట్టుగా మేకర్స్ చెబుతున్నారు. తాజాగా వదిలిన పోస్టర్ కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. తనని వెంటాడుతున్న వారి నుంచి తప్పించుకునే పనిలో ఉన్న నాయిక, అవసరమైతే తిరగబడే ఉద్దేశంతో ఉన్నట్టుగా ఈ పోస్టర్ లో కనిపిస్తోంది. ఆడియన్స్ ఎదురుచూసే సిరీస్ ల జాబితాలో ఇప్పుడు ఇది కూడా చేరిపోయినట్టే.

More Telugu News