Chandrababu: చంద్రబాబు అరెస్ట్ పై 40వ రోజూ కొనసాగిన ప్రదర్శనలు

  • స్కిల్ కేసులో చంద్రబాబు అరెస్ట్
  • రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ దీక్షలు
  • బాబుతో నేను అంటూ నినదించిన శ్రేణులు
TDP protests continues on 40th day

టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్ ను ఖండిస్తూ టీడీపీ శ్రేణుల నిరసనలు 40వ రోజు కూడా కొనసాగాయి. చంద్రబాబు నాయుడు ఆరోగ్యం బాగుండాలని, త్వరగా బయటకు రావాలని సత్యసాయి జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ఇంఛార్జ్ బీకే పార్థసారథి, ఎమ్మిగనూరు నియోజకవర్గ ఇంఛార్జ్ జయ నాగేశ్వర్ రెడ్డిలు విజయవాడ కనకదుర్గమ్మను దర్శించుకుని ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. 

నెల్లూరు 46వ డివిజన్‍లో మాజీ మంత్రి నారాయణ దంపతులు శ్రీమహాలక్ష్మి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. తిరువూరు రూరల్ మండలం మల్లెల గ్రామ పార్టీ  ఆధ్వర్యంలో చంద్రబాబు కోసం సంఘీభావ పాదయాత్ర నిర్వహించారు. మల్లెల గ్రామం నుంచి పుట్రేల మారెమ్మ గుడి వరకు పాదయాత్ర నిర్వహించటం జరిగింది. 

కావలి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ మాలేపాటి సుబ్బానాయుడు కావలి పట్టణంలోని వడ్డిపాలెంలో శ్రీ కనకదుర్గ అమ్మవారి ఆలయంలో జరుగుతున్న దసరా నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా లక్ష్మి గణపతి హోమం, దుర్గాసూక్త, శ్రీ సూక్త ఆయుష్ హోమాలు నిర్వహించారు. కోనసీమ జిల్లా ఆత్రేయపురం మండలం అంకంపాలెం గ్రామంలో నవగ్రహ హోమం నిర్వహించారు. 

తిరువూరు పట్టణంలో ఉన్న ఏసీఏ, పాత కొండూరులో ఉన్న ఈసీఐ చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. మంగళగిరి మండలం, బేతపూడి  గ్రామంలోని తెలుగు బాప్టిస్ట్ చర్చిలో నియోజకవర్గ టీడీపీ క్రిస్టియన్ సెల్ నాయకులు సంఘ పెద్దలతో కలిసి ఆదివారం ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. చంద్రబాబు క్షేమం కోరుతూ జగ్గంపేటలో టీడీపీ నేత మల్లవరం గ్రామ సర్పంచ్ యిడుదుల లక్ష్మి అర్జునరావు శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం వద్ద సుమారు 700 మందికి అన్నదానం నిర్వహించారు. 

పుట్టపర్తి నియోజకవర్గం బుక్కపట్నం మండల కేంద్రంలో శ్రీ చౌడేశ్వరి అమ్మవారి దేవాలయంలో టీడీపీ నాయకులు పూజలు నిర్వహించారు. తుని మండలం, వెలమ కొత్తూరు పంచాయతీ ఎన్ హెచ్-16 హైవే రోడ్డును అనుకుని ఉన్న ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ బాబా రాందేవ్ జీ మందిరంలో హోమం, ప్రత్యేక పూజలు నిర్వహించారు. 

మంగళగిరి మండలం, చిన్నకాకాని, హైలాండ్ సమీపంలో ఉన్న జూపిటర్ అపార్ట్ మెంట్ వాసులు శ్రీ లక్ష్మీనరసింహస్వామి సుదర్శన యాగం ఘనంగా నిర్వహించారు. పార్టీలకు అతీతంగా నాయకులు ప్రజలు హాజరయ్యారు. 

పొలిట్‌బ్యూరో సభ్యులు నక్కా ఆనందబాబు, బ్రాహ్మణ సాధికార సమితి రాష్ట్ర కన్వీనర్‌ బుచ్చి రాంప్రసాద్‌, రాష్ట్ర కార్యదర్శి కనపర్తి శ్రీనివాసరావు, గుంటూరు పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి పోతినేని శ్రీనివాసరావులు పాల్గొన్నారు. జగ్గంపేట నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో కాకినాడ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు జ్యోతుల నవీన్, లక్ష్మీదేవి దంపతులు చండీయాగం నిర్వహించారు.

More Telugu News