BJP: బిగ్ బ్రేకింగ్.. రాజా సింగ్ పై సస్పెన్షన్ ఎత్తివేసిన బీజేపీ

BJP High Command Revoked Suspension On Raja Singh

  • పార్టీ అభ్యర్థుల జాబితాలో రాజాసింగ్ పేరు
  • గోషామహల్ నుంచి పోటీలో నిలిపిన బీజేపీ
  • వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో గతేడాది సస్పెన్షన్ వేటు

గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ పై భారతీయ జనతా పార్టీ సస్పెన్షన్ ను ఎత్తివేసింది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో మరోమారు గోషామహల్ నియోజకవర్గం నుంచి బరిలో దింపింది. ఈమేరకు బీజేపీ విడుదల చేసిన పార్టీ అభ్యర్థుల తొలి జాబితాలో రాజా సింగ్ పేరును పార్టీ అధిష్ఠానం చేర్చింది. వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన రాజా సింగ్ ను గతేడాది ఆగస్టులో బీజేపీ సస్పెండ్ చేసింది. రాజా సింగ్ పై విధించిన సస్పెన్షన్ ను ఎత్తివేస్తున్నట్లు బీజేపీ డిసిప్లినరీ కమిటీ ఆదివారం ఓ ప్రకటనలో తెలిపింది. తెలంగాణ అసెంబ్లీ బరిలో నిలపనున్న అభ్యర్థుల తొలి జాబితాలో రాజా సింగ్ పేరును అధిష్ఠానం చేర్చింది.

BJP
Raja Singh
GoshaMahal Mla
Bjp telangana
Telangana Assembly Election
BJP First List
  • Loading...

More Telugu News