Shruti Haasan: నేను అది డెంగ్యూ అనుకున్నా: శ్రుతి హాసన్

Shruthi haasan says she is totally recovered from viral fever
  • వైరల్ ఫీవర్ నుంచి పూర్తిగా కోలుకున్న నటి శ్రుతి హసన్
  • తొలుత డెంగ్యూ అనుకుంటే వైరల్ ఫీవర్‌గా తేలిందని వెల్లడి
  • వైరల్ పీవరేకదా అని లైట్ తీసుకున్నందుకు బాగా నీరసించిపోయానన్న శ్రుతి
  • ప్రస్తుతం పూర్తిగా కోలుకున్నట్టు నెట్టింట ప్రకటన
  • తనకు చికిత్స చేసిన వైద్యులు, ఆసుపత్రి సిబ్బందికి ధన్యవాదాలు

ఇటీవల కొన్ని రోజుల పాటు వైరల్ ఫీవర్‌తో బాధపడ్డ ప్రముఖ నటి శ్రుతి హసన్ ప్రస్తుతం పూర్తిగా కోలుకుంది. ఈ సందర్భంగా తనకు చికిత్స చేసిన వైద్యులకు ఆసుపత్రి సిబ్బందికి ఆమె ధన్యవాదాలు చెబుతూ నెట్టింట తాజాగా పోస్ట్ పెట్టింది. 

‘‘నాకు వచ్చింది డెంగ్యూ అని అనుకున్నా. కానీ అది మరో వైరల్ ఫీవర్ అని తేలింది. వైరల్ ఫీవరే కదా అని లైట్ తీసుకోవడంతో అది నేను పూర్తిగా నీరసించి నేలకు అంటుకుపోయేలా చేసింది. చాలా వీక్ అయ్యా. అయితే, ఇప్పుడు పూర్తిగా కోలుకున్నా’’ అని శ్రుతి చెప్పుకొచ్చింది. 

ప్రస్తుతం శ్రుతి పూర్తిగా కోలుకోవడంతో ఆమె అభిమానులు అక్టోబర్ 26 కోసం ఉత్సుకతతో ఎదురుచూస్తున్నారు. ఆ రోజున ఓ సర్‌ప్రైజ్ ఉంటుందని గతంలో శ్రుతి ప్రకటించడమే ఇందుకు కారణం. దీంతో, శ్రుతి తన తదుపరి సినిమా గురించి ప్రకటిస్తుందా? లేదా మరే ఇతర అంశమైనా ఉంటుందా? అని అభిమానులు నెట్టింట తెగ చర్చిస్తున్నారు.

  • Loading...

More Telugu News