Nepal Earthquake: నేపాల్‌ను భయపెట్టిన భూకంపం.. భయంతో పరుగులు తీసిన జనం

  • ఈ ఉదయం 7.39 గంటలకు భూకంపం
  • ఇళ్ల నుంచి బయటకు వచ్చి పరుగులు తీసిన జనం
  • ఆస్తి, ప్రాణ నష్టంపై అందని నివేదికలు
Earthquake hits Nepal capital city Kathmandu

నేపాల్ రాజధాని కఠ్మాండును ఈ ఉదయం భూకంపం కుదిపేసింది. దాని తీవ్రత రిక్టర్ స్కేలుపై 6.1గా నమోదైంది. భూ ప్రకంపనలతో వణికిపోయిన జనం భయంతో రోడ్లపైకి వచ్చి పరుగులు తీశారు. భూకంప కేంద్రం ధడింగ్‌లో ఉన్నట్టు నేపాల్ జాతీయ భూకంప పర్యవేక్షణ, పరిశోధన సంస్థ తెలిపింది.

ఉదయం 7.39 గంటల సమయంలో భూకంపం సంభవించింది. బాగ్‌మతి, గండకి ప్రావిన్సుల్లోనూ ప్రకంపనలు సంభవించాయి. అయితే, ఈ భూంకంపం కారణంగా ఇప్పటి వరకు ఎలాంటి ప్రాణ, ఆస్తినష్టం సంభవించలేదు. నేపాల్‌లో భూకంపాలు సర్వసాధారణ విషయంగా మారిపోయాయి. 2007లో ఇక్కడ సంభవించిన భూకంపంలో దాదాపు 9 వేల మంది ప్రాణాలు కోల్పోయారు.

More Telugu News