Nara Lokesh: నారా లోకేశ్ ఆధ్వర్యంలో నవంబరు 1 నుంచి 'భవిష్యత్ కు గ్యారెంటీ' కార్యక్రమం

  • ఇవాళ లోకేశ్ అధ్యక్షతన టీడీపీ సర్వసభ్య సమావేశం
  • ఐదు గంటల పాటు సాగిన కీలక సమావేశం
  • పలు కీలక నిర్ణయాలు తీసుకున్న టీడీపీ నాయకత్వం 
Nara Lokesh decided to takes forward Bhavishyat Ku Guarantee program

టీడీపీ అధినేత చంద్రబాబు 'భవిష్యత్ కు గ్యారెంటీ' కార్యక్రమంలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా పర్యటనలు చేపడుతున్న సమయంలోనే అరెస్టయిన సంగతి తెలిసిందే. ఇప్పుడా కార్యక్రమాన్ని చంద్రబాబు తనయుడు నారా లోకేశ్ ముందుకు తీసుకెళ్లనున్నారు. 

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ అధ్యక్షతన టీడీపీ సర్వసభ్య సమావేశం ఈ రోజు 5 గంటల పాటు సాగింది. నారా లోకేశ్ ఆధ్వర్యంలో  నవంబరు 1 నుంచి 'భవిష్యత్ కు గ్యారెంటీ' కార్యక్రమాన్ని కొనసాగించాలని ఈ సమావేశంలో నిర్ణయించారు. చంద్రబాబు అరెస్ట్ నేపథ్యంలో ఈ కార్యక్రమం నంద్యాలలో ఆగిపోగా, తిరిగి అక్కడ్నించే నారా లోకేశ్ కొనసాగించనున్నారు. చంద్రబాబు అరెస్ట్ అంశాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని తీర్మానించారు. 

ఇక, నారా భువనేశ్వరి ఆధ్వర్యంలో నిర్వహించబోయే 'నిజం గెలవాలి' కార్యక్రమం వారానికి మూడు రోజులు చేపట్టాలని నిర్ణయించారు.

More Telugu News