Nara Bhuvaneswari: పుంగనూరు ఘటన చూసి దిగ్భ్రాంతికి గురయ్యాను: నారా భువనేశ్వరి

  • చంద్రబాబుకు సంఘీభావంగా శ్రీకాకుళం నుంచి సైకిల్ ర్యాలీ
  • పుంగనూరులో టీడీపీ కార్యకర్తలను అడ్డుకున్న వైసీపీ నేతలు
  • పసుపు చొక్కాలు విప్పించిన వైనం
  • 30 ఏళ్ల కిందట బీహార్ లో కూడా ఇలాంటి పరిస్థితులు లేవన్న భువనేశ్వరి
Nara Bhuvaneswari reacts on Punganuru incident

స్కిల్ కేసులో అరెస్టయిన చంద్రబాబుకు సంఘీభావంగా కొందరు టీడీపీ మద్దతుదారులు శ్రీకాకుళం నుంచి కుప్పంకు సైకిల్ ర్యాలీ నిర్వహించారు. అయితే వారిని పుంగనూరు మండలంలో వైసీపీ నేతలు తీవ్రస్థాయిలో దూషించి, పసుపు చొక్కాలు విప్పించారు. ఈ ఘటనను కొందరు వీడియో తీయగా, సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ ఘటన పట్ల నారా భువనేశ్వరి స్పందించారు. 

పుంగనూరులో శ్రీకాకుళం వాసులను చొక్కాలు విప్పించిన ఘటన చూసి తాను షాక్ కు గురయ్యానని వెల్లడించారు. ప్రజలందరినీ ఇది నివ్వెరపరిచిందని తెలిపారు.

"రాష్ట్రంలో రౌడీ రాజకీయానికి ఈ దాడి నిదర్శనం. 30 ఏళ్ల క్రితం బీహార్ లో కూడా ఇంత అరాచక పరిస్థితులు లేవు. పేదలపై పెత్తందారీ పోకడలు అంటే ఇవే! తెలుగుదేశం అంటే ఒక కుటుంబం. తండ్రి లాంటి తమ నేతను అక్రమంగా జైల్లో పెడితే బిడ్డలైన కార్యకర్తలు సైకిల్ యాత్ర చేసుకునే హక్కు కూడా లేదా? నడిరోడ్డుపై బూతులు తిడుతూ ఆ సామాన్యులకు మీరు చేసిన అవమానం ప్రజలంతా గమనించారు. ఎల్లకాలం నియంతల పెత్తనం సాగదు. అంతిమ విజయం ప్రజాస్వామ్యానిదే" అంటూ భువనేశ్వరి స్పష్టం చేశారు.

More Telugu News