K Kavitha: రాహుల్ గాంధీపై ఎమ్మెల్సీ కవిత తీవ్ర విమర్శలు

MLC Kavitha lashes out at Rahul Gandhi
  • కేసీఆర్ దీక్ష చేస్తేనే కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రకటించిందన్న కవిత
  • గాంధీ కుటుంబానికి, తెలంగాణకు మధ్య విద్రోహ సంబంధం ఉందని విమర్శ
  • రాహుల్ గాంధీ బబ్బర్ షేర్ కాదని, పేపర్ పులి మాత్రమేనని ఎద్దేవా
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై బీఆర్ఎస్ నాయకురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత నిప్పులు చెరిగారు. ఆమె జగిత్యాల జిల్లా మెట్‌పల్లిలో మీడియాతో మాట్లాడుతూ... మన ముఖ్యమంత్రి కేసీఆర్ నాడు దీక్ష చేస్తేనే కాంగ్రెస్ పార్టీ తెలంగాణను ప్రకటించిందన్నారు. ఉద్యమాలు, అమరవీరుల కారణంగా రాష్ట్రం సిద్ధించిందన్నారు. గాంధీ కుటుంబానికి, తెలంగాణకు మధ్య విద్రోహ సంబంధం ఉందని విమర్శించారు.

రాహుల్ గాంధీ బబ్బర్ షేర్ కాదని, పేపర్ పులి మాత్రమే అన్నారు. ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి వయసు మరిచి దిగజారి మాట్లాడుతున్నారన్నారు. సింగరేణి కార్మికులకు బీఆర్ఎస్ హయాంలోనే న్యాయం జరిగిందన్నారు. బీఆర్ఎస్ మేనిఫెస్టో బీడీ కార్మికులకు ఉపయోగపడే విధంగా ఉందన్నారు. ఉపాధి కోసం వెళ్లి గల్ఫ్‌లో చనిపోయిన వారికీ ప్రభుత్వ బీమా వర్తిస్తుందన్నారు. గల్ఫ్‌లో ఉన్న వారి పేర్లు రేషన్ కార్డుల నుంచి ఎట్టి పరిస్థితుల్లో తొలగించమని హామీ ఇచ్చారు.
K Kavitha
Rahul Gandhi
Congress
BRS

More Telugu News