aeroplane: తన బ్యాగులో బాంబు ఉందంటూ ప్రయాణికుడి బెదిరింపు... ముంబైలో విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్

  • పూణే నుంచి ఢిల్లీకి వెళుతున్న 'ఆకాశ' విమానం  
  • బాంబు డిటెక్షన్ అండ్ డిస్పోజల్ స్క్వాడ్‌కు సమాచారం అందించిన అధికారులు
  • బ్యాగులో తనిఖీ... దొరకని అనుమానాస్పద వస్తువులు
  • ప్రయాణికుడి మానసికస్థితిని అంచనా వేస్తున్న అధికారులు
Bomb Threat Comes From Passenger Aircraft Makes Emergency Landing At Mumbai Airport

ఓ ప్రయాణికుడి నుంచి బాంబు బెదిరింపు రావడంతో 'ఆకాశ' ఎయిర్ విమానం... ముంబై విమానాశ్రయంలో అత్యవసరంగా దిగిన ఘటన శనివారం చోటు చేసుకుంది. 185 మంది ప్రయాణికులతో వెళ్తోన్న ఆకాశ ఎయిర్ విమాం పూణే నుంచి ఢిల్లీకి బయలుదేరింది. అయితే తన బ్యాగులో ఓ బాంబు ఉందంటూ ఓ ప్రయాణికుడు బెదిరించాడు. దీంతో ఢిల్లీకి బయలుదేరిన ఆ విమానం ముంబైలో అత్యవసరంగా దిగవలసి వచ్చింది.

బాంబు డిటెక్షన్ అండ్ డిస్పోజల్ స్క్వాడ్‌కు సమాచారం అందించడంతో బెదిరింపులకు దిగిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. అతని బ్యాగును తనిఖీ చేయగా ఎలాంటి అనుమానాస్పద వస్తువు లభించలేదు. ఈ ఘటనపై దర్యాఫ్తు జరుపుతున్నారు. ప్రయాణికుడు మానసిక స్థితిని అంచనా వేస్తున్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి.

185 మంది ప్రయాణికులు, ఆరుగురు సిబ్బందితో వెళ్తోన్న ఆకాశ విమానాన్ని భద్రతాపరమైన హెచ్చరికలతో వెంటనే ముంబైకి మళ్లించామని, అక్కడ సురక్షితంగా ల్యాండ్ అయిందని విమానయాన సంస్థ తెలిపింది. తనిఖీలు పూర్తయ్యాక విమానాన్ని ముంబై నుంచి ఢిల్లీకి పంపించినట్లు తెలిపారు.

More Telugu News