Saddula Bathukamma: రేపు సద్దుల బతుకమ్మ.. హైదరాబాద్‌లో రేపు పొరపాటున కూడా ఈ రోడ్లపైకి వెళ్లొద్దు సుమా!

  • రేపు మధ్యాహ్నం 2 నుంచి రాత్రి 11 గంటల వరకు ఆంక్షలు
  • ట్యాంక్‌బండ్‌పైకి వాహనాలకు నో ఎంట్రీ
  • బతుకమ్మ సంబరాలకు వచ్చే వారికి స్నో వరల్డ్, ఎన్టీఆర్ స్టేడియం, ఎన్టీఆర్ గార్డెన్‌లో పార్కింగ్
Traffic Restictions in Hyderabad Tomorrow

సద్దుల బతుకమ్మ సందర్భంగా హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు ఉండనున్నాయి. లుంబిని పార్క్, అప్పర్ ట్యాంక్‌బండ్‌పై రేపు మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు ఆంక్షలు అమల్లో ఉంటాయి. అలాగే, తెలుగుతల్లి ఫ్లై ఓవర్, కర్బాలా మైదాన్ వైపు నుంచి వచ్చే వాహనాలకు ఈ సమయంలో ట్యాంక్‌బండ్‌పైకి అనుమతి ఉండదు. ఇక, ఇతర జిల్లాల నుంచి వచ్చే ఆర్టీసీ బస్సులను జేబీఎస్‌ స్వీకార్‌-ఉపకార్‌ వద్ద డైవర్ట్ చేస్తారు. బతుకమ్మ సంబురాలకు వచ్చే వారికి స్నో వరల్డ్‌, ఎన్టీఆర్‌ స్టేడియం, ఎన్టీఆర్‌ గార్డెన్‌ పక్కనే పార్కింగ్‌ స్థలాలను కేటాయించారు.  

నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు ఇలా..
* సికింద్రాబాద్‌ నుంచి ట్యాంక్‌బండ్ వైపు వచ్చే వాహనాలను కర్బాలా మైదాన్‌ వద్ద బైబిల్‌ హౌస్‌ మీదుగా తెలుగు తల్లి ఫ్లై ఓవ‌ర్ వైపు డైవర్ట్ చేస్తారు.
*ఇక్బాల్‌ మినార్‌ నుంచి వచ్చే వాహనాలను తెలుగు తల్లి ఫ్లై ఓవ‌ర్ వైపు మళ్లిస్తారు.
* పంజాగుట్ట, రాజ్‌భవన్‌ రోడ్డు నుంచి ఖైరతాబాద్ ఫ్లై ఓవ‌ర్‌ మీదుగా వచ్చే వాహనాలను నెక్లెస్‌ రోటరీ ఇందిరాగాంధీ విగ్రహం వద్ద ఐమాక్స్‌ రూట్‌లోకి మళ్లిస్తారు.
* నల్లగుట్ట నుంచి బుద్దభవన్‌ వైపు వాహనాలకు అనుమతి లేదు. నల్లగుట్ట క్రాస్‌రోడ్డు వద్ద రాణిగంజ్‌, నెక్లెస్‌ రోడ్డు వైపు డైవర్ట్ చేస్తారు.
* హిమయత్‌నగర్‌, బషీర్‌బాగ్‌, అంబేద్కర్‌ విగ్రహం వైపు నుంచి ట్యాంక్‌బండ్‌పైకి వాహనాలకు అనుమతి లేదు. ఇక్బాల్‌ మినార్‌ వైపు వెళ్లి యూ టర్న్‌ తీసుకొని తెలుగు తల్లి జంక్షన్‌, తెలుగు తల్లి ఫ్లై ఓవ‌ర్‌పై నుంచి వెళ్లాల్సి ఉంటుంది.
* ముషీరాబాద్‌ నుంచి ట్యాంక్‌బండ్‌ వైపు వచ్చే వాహనాలను కవాడిగూడ క్రాస్‌రోడ్డు వద్ద డైవర్ట్ చేస్తారు.

More Telugu News