Pneumonia: రోగులతో నిండిపోతున్న ఆసుపత్రులు.. తెలంగాణలో న్యుమోనియా విశ్వరూపం

  • హైదరాబాద్ సహా రాష్ట్రమంతా న్యూమోనియా
  • జలుబు, దగ్గు, జ్వరం, తలనొప్పి, కండరాల నొప్పులు వంటివన్నీ న్యుమోనియా లక్షణాలే
  • దగ్గు, తుమ్ములు, నోటి తుంపర్ల ద్వారా ఇతరులకు సంక్రమణ
  • జాగ్రత్తగా ఉండాలంటున్న వైద్యులు
Pneumonia attacks Telangana

తెలంగాణను ఇప్పుడు న్యుమోనియా భయపెడుతోంది. హైదరాబాద్ సహా దాదాపు అన్ని జిల్లాల ఆసుపత్రులు న్యుమోనియా రోగులతో నిండిపోతుండడం ఆందోళన రేకెత్తిస్తోంది. నిన్నమొన్నటి వరకు భయపెట్టిన డెంగ్యూ ఇప్పుడిప్పుడే నెమ్మదిస్తున్న వేళ న్యుమోనియా ఉగ్రరూపం దాల్చుతోంది. వైరస్, బ్యాక్టీరియా ద్వారా వ్యాపించే ఈ వ్యాధి రోగనిరోధకశక్తి ఉన్న వారిని టార్గెట్ చేసుకుంటుంది. అలాగే, దీర్ఘకాలిక జబ్బులతో బాధపడేవారు, పొగతాగేవారు, మద్యం తాగేవారు, ఊపిరితిత్తుల సమస్యలతో బాధపడేవారు న్యుమోనియాతో దవాఖానల్లో చేరుతున్నారు. వాతావరణ మార్పుల వల్ల ఈ కేసులు ఇటీవలి కాలంలో బాగా పెరిగినట్టు వైద్యులు చెబుతున్నారు. 

న్యుమోనియా బారినపడేవారిలో జలుబు, జ్వరం, కండరాల నొప్పులు, దగ్గు, తలనొప్పి, చెమటలు పట్టడం, వికారం, వాంతులు, గుండె వేగంగా కొట్టుకోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. రోగుల నుంచి ఇది దగ్గు, తమ్ములు, నోటి తుంపర్ల ద్వారా ఇతరులకు వ్యాపిస్తుందని, కాబట్టి రోగులు మాస్కు ధరించాలని వైద్యులు తెలిపారు. పై లక్షణాల్లో ఏ ఒక్కటి కనిపించినా వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచించారు.

More Telugu News