JAC: ఈ నెల 23న రాజమండ్రిలో నారా లోకేశ్, పవన్ కల్యాణ్ అధ్యక్షతన కీలక సమావేశం

  • ఏపీలో పొత్తు కుదుర్చుకున్న టీడీపీ, జనసేన
  • ఎన్నికల కోసం కలిసి నడవాలని నిర్ణయం
  • పొత్తు సమన్వయం కోసం ఇప్పటికే జేఏసీ సభ్యులను ప్రకటించిన ఇరు పార్టీలు
Lokesh and Pawan Kalyan will chair JAC meeting in Rajahmundry on Oct 23

ఏపీలో మరి కొన్ని నెలల్లో ఎన్నికలు జరగనుండగా, పొత్తు కార్యాచరణను ముందుకు తీసుకెళ్లేందుకు టీడీపీ-జనసేన నిర్ణయించాయి. ఈ క్రమంలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఈ నెల 23న రాజమండ్రిలో సమావేశం కానున్నారు. 

లోకేశ్, పవన్ కల్యాణ్ అధ్యక్షతన టీడీపీ-జనసేన జేఏసీ సమావేశం నిర్వహించనున్నారు. ఎన్నికల దిశగా ఉమ్మడి కార్యాచరణ, ఇరు పార్టీల మధ్య సమన్వయం కుదర్చడం తదితర అంశాలపై ఈ కీలక భేటీలో చర్చించి నిర్ణయం తీసుకున్నారు. రాజకీయ కార్యక్రమాల జోరు పెంచేలా తగిన ప్రణాళికలు సిద్ధం చేయడంపైనా ఈ సమావేశంలో చర్చించనున్నారు. 

కాగా, పొత్తు సమన్వయం కోసం టీడీపీ, జనసేన ఇప్పటికే జేఏసీ సభ్యులను ప్రకటించిన సంగతి తెలిసిందే.

More Telugu News