కొడాలి నాని మేనకోడలి వివాహానికి హాజరైన సీఎం జగన్

  • అయాన కన్వెషన్ కేంద్రంలో జరిగిన వివాహ వేడుకల్లో పాల్గొన్న జగన్
  • జగన్ రాగానే సాదర ఆహ్వానం పలికి వేదికపైకి తీసుకెళ్లిన కొడాలి నాని
  • డాక్టర్ స్నేహ, డాక్టర్ అనురాగ్ దీపక్‌లను ఆశీర్వదించిన సీఎం   
మాజీ మంత్రి, గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని మేనకోడలి వివాహానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి హాజరయ్యారు. కంకిపాడు అయాన కన్వెన్షన్ సెంటర్‌లో జరిగిన వివాహ వేడుకల్లో వధూవరులు డాక్టర్ స్నేహ, డాక్టర్ అనురాగ్ దీపక్‌లను ముఖ్యమంత్రి జగన్ ఆశీర్వదించారు. ఈ వివాహానికి హాజరైన జగన్‌కు కొడాలి నాని సాదర స్వాగతం పలికారు. జగన్ మండపం వద్దకు రాగానే పుష్పగుచ్ఛం ఇచ్చి ఆహ్వానించారు. ఆ తర్వాత వేదిక పైకి తీసుకు వెళ్లి, కుటుంబ సభ్యులను పరిచయం చేశారు. ఆ తర్వాత వధూవరులపై అక్షితలు వేసి ఆశీర్వదించారు.

Kodali Nani
YS Jagan
Vijayawada
marriage

More Telugu News