Revanth Reddy: కేసీఆర్ కుటుంబం నాంపల్లి దర్గా వద్దో, బిర్లా మందిర్ వద్దో బిచ్చం అడుక్కునేది: రేవంత్ రెడ్డి

If Sonia Gandhi didnt give Telangana KCR family would have been begging says Revanth Reddy
  • తెలంగాణ ప్రజలను కేసీఆర్ నట్టేట ముంచారంటూ రేవంత్ మండిపాటు
  • సోనియా తెలంగాణను ఇవ్వకపోతే అడుక్కునేవారని తీవ్ర వ్యాఖ్య
  • కేటీఆర్ అమెరికాలో బాత్రూమ్ లు కడుక్కునేవాడివని ఎద్దేవా
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో అన్ని ప్రధాన రాజకీయ పార్టీలు ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. ఈ క్రమంలో నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. తాజాగా పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని జూనియర్ కాలేజీ గ్రౌండ్ లో జరిగిన బహిరంగ సభలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ప్రసంగిస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబంపై నిప్పులు చెరిగారు. ఎన్నో ఆశలతో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్న ప్రజలను నట్టేట ముంచిన కేసీఆర్... మూడో సారి సీఎం కావాలని కలలు కంటున్నారని మండిపడ్డారు. మరోసారి అధికారంలోకి వచ్చి ప్రజలను దోచుకోవాలని చూస్తున్నారని విమర్శించారు. 

సోనియాగాంధీ తెలంగాణను ఇవ్వకపోతే... కేసీఆర్ కుటుంబం నాంపల్లి దర్గా వద్దో, బిర్లా మందిర్ వద్దో బిచ్చం అడుక్కునేదని రేవంత్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. లక్ష కోట్ల రూపాయలు, వేలాది ఎకరాల భూములు ఎలా వచ్చాయో కేసీఆర్ చెప్పాలని డిమాండ్ చేశారు. రాహుల్ గాంధీ ఎవరు? అని అడుగుతున్న కేటీఆర్ ఒక సన్నాసి అని అన్నారు. ఈ దేశానికి గాంధీ కుటుంబం చేసిన త్యాగాలు ఏమిటో తెలుసుకోవాలని చెప్పారు. తెలంగాణ రాకపోతే అమెరికాలో బాత్రూమ్ లు కడుక్కునేవాడివి కేటీఆర్ అని అన్నారు. గాంధీ కుటుంబానికి ఉండటానికి ఇళ్లు కూడా లేవని... పదేళ్లలోనే ఫామ్ హౌస్ లు కట్టుకున్న చరిత్ర కేసీఆర్ కుటుంబానిదని దుయ్యబట్టారు.
Revanth Reddy
Congress
KCR
KTR
BRS

More Telugu News