same sex marriage: ఆసియాలో ఈ ఒక్క దేశంలోనే స్వలింగ వివాహాలకు చట్టబద్ధత

  • 2019లో స్వలింగ వివాహాలకు ఆమోదం తెలిపిన తైవాన్
  • ఈ తరహా చట్టం కలిగిన ఏకైక ఆసియా దేశంగా గుర్తింపు
  • ప్రపంచంలో ఈ తరహా చట్టాన్ని తొలిగా తెచ్చింది నెదర్లాండ్స్
Which is the only Asian Country to legalise same sex marriage

స్వలింగ వివాహాలకు చట్టబద్ధత కల్పించేందుకు భారత సుప్రీంకోర్టు నిరాకరించడంతో.. అసలు ఇలాంటి చట్టం ఎక్కడైనా ఉందా..? అన్న ఆశ్చర్యం కలగకపోదు. ఆసియాలోనే ఒక దేశంలో స్వలింగ జాతీయుల మధ్య వివాహానికి చట్టబద్ధత కలిపించారు. ఆ దేశం తైవాన్. 2019లో స్వలింగ వివాహాలను చట్టప్రకారం గుర్తిస్తున్నట్టు ప్రకటించడం ద్వారా ప్రపంచం దృష్టిని తైవాన్ ఆకర్షించింది. స్వలింగ వివాహాలు ఒక్క తైవాన్ కే పరిమితం అనుకోకండి. ఆఫ్రికా సహా ఎన్నో దేశాల్లో ఈ ఆచారం నడుస్తోంది.


ఒకే లింగానికి చెందిన వారి వివాహాలకు ప్రపంచవ్యాప్తంగా 34 దేశాలు ఇప్పటి వరకు చట్టపరమైన గుర్తింపును కల్పించాయి. ఇలాంటి వివాహాలకు ప్రపంచంలో తొలిగా ఆమోదం తెలిపిన దేశం నెదర్లాండ్స్. 2001లో ఇక్కడ ఆమోదం లభించింది. తాజాగా ఈ వివాహాలకు చట్టబద్ధత కల్పించినది అండోరా. ప్రస్తుత వివాహ చట్టాలు ప్రజల వివాహ స్వేచ్ఛ, సమానత్వ హక్కుకు విరుద్ధంగా ఉన్నాయంటూ తైవాన్ రాజ్యంగపరమైన కోర్టు తీర్పు చెప్పడం ద్వారా దీనికి మార్గం సుగమం చేసింది. చూస్తుంటే.. భవిష్యత్తులో మరిన్ని దేశాలకు ఈ స్వలింగ వివాహ చట్టాలు విస్తరించేలా కనిపిస్తున్నాయి. ప్రకృతి విరుద్ధమైన ఈ బంధానికి మన దేశంలో మంచు లక్ష్మి, సెలీనా జైట్లీ, భూమి పెడ్నేకర్ తదితర ఎంతో మంది సెలబ్రిటీలు సైతం మద్దతు పలుకుతుండడం గమనార్హం.

More Telugu News