Florida: కారులో దూసుకెళ్లి కాలువలో తేలిన యువకుడు.. ఫ్లోరిడాలో ఘటన.. వీడియో ఇదిగో!

  • కేప్ కోరల్ సిటీలో ఓ రేసర్ కు ఎదురైన భయానక అనుభవం
  • గంటకు 128 కి.మీ. స్పీడ్ తో వెళ్తుండగా అదుపుతప్పిన కారు
  • అదే వేగంతో దూసుకెళ్లి కాలువలో పడ్డ మెర్సిడస్ బెంజ్
  • స్థానికుల సాయంతో ఒడ్డుకు చేరిన డ్రైవర్
Florida street racer driving 80 mph lands in canal

అమెరికాలోని ఫ్లోరిడాలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. వేగంగా దూసుకొచ్చిన కారు ఒకటి కంట్రోల్ తప్పి కాలువలో పడింది. చుట్టుపక్కల వారి సాయంతో కారు డ్రైవర్ ఒడ్డుకు చేరాడు. ఇదంతా ఓ ఇంటి ముందున్న సీసీ కెమెరాలో రికార్డయింది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. క్లిక్ ఓర్లాండో ప్రచురించిన కథనం ప్రకారం.. కేప్ కోరల్ సిటీలో ఓ యువకుడు తన మెర్సిడస్ బెంజ్ కారులో వేగంగా దూసుకెళుతున్నాడు. గంటకు 80 ఎంపీహెచ్ ( 128 కి.మీ) వేగంతో వెళుతుండగా ఓ టర్నింగ్ వద్ద కారు అదుపుతప్పింది. అదే వేగంతో ముందుకెళుతూ గుంతల్లో ఎగిరిపడింది.

అయినా ఆగకుండా వెళ్లి పక్కనే ఉన్న కాలువలో పడింది. కారులోకి నీళ్లు రావడంతో బయటపడేందుకు డ్రైవర్ విఫలయత్నం చేశాడు. ఇంతలో అక్కడికి చేరుకున్న ఓ స్థానికుడు కాలువలోకి దూకి ఆ డ్రైవర్ ను కారులో నుంచి బయటకు లాగాడు. ఆపై ఇద్దరూ కలిసి ఒడ్డుకు చేరారు. కాసేపటికే కారు మొత్తం నీట మునిగింది. ఇదంతా ఓ ఇంటి ముందున్న సీసీ కెమెరాలో రికార్డయింది. ఆ వీడియోను సోషల్ మీడియాలో పెట్టిన సదరు ఇంటి ఓనర్.. ఈ ప్రమాదం తనను భయపెట్టిందని కామెంట్ చేశాడు.

More Telugu News