ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ కొత్త లుక్ చూశారా?
- రీబ్రాండింగ్లో భాగంగా ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ కొత్త లుక్ ఆవిష్కరణ
- బుధవారం కొత్త డిజైన్తో మెరిసిపోతున్న బోయింగ్ విమానాన్ని ప్రదర్శించిన సంస్థ సీఈఓ
- తమ దార్శనికతకు, లక్ష్యాలకు కొత్త డిజైన్ నిదర్శనమని వ్యాఖ్య
రాబోయే 15 నెలల్లో కొత్త డిజైన్, చిహ్నాలు ఉన్న 50 బోయింగ్ 737 విమానాలను సంస్థ అందుబాటులోకి తేనుంది. వచ్చే ఏడేళ్లల్లో 170 నారో బాడీ విమానాలు కలిగిన సంస్థగా ఎదగాలని ఎయిర్ఇండియా ఎక్స్ప్రెస్ లక్ష్యాన్ని నిర్దేశించుకుంది. ఇటీవలే ఎయిర్ ఇండియా కొత్త లోగోను ఆవిష్కరించిన విషయం తెలిసిందే.