YS Jagan: చంద్రబాబు పిటిషన్‌పై శుక్రవారం నాడు సుప్రీంకోర్టు తీర్పు... డీజీపీ, పొన్నవోలు, సజ్జలతో సీఎం జగన్ సమీక్ష

YS Jagan review on chandrababu naidu quash petition
  • సీఎం నివాసంలో కీలక సమావేశం 
  • తీర్పు ఎలా వస్తుందనే అంశంపై న్యాయవాదుల నుంచి అభిప్రాయ సేకరణ
  • తీర్పు ఎలా వచ్చినా అప్రమత్తంగా ఉండాలని డీజీపీకి ఆదేశం
స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు వేసిన క్వాష్ పిటిషన్‌పై సుప్రీంకోర్టులో శుక్రవారం తీర్పు వెలువడే అవకాశముంది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్... డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, అదనపు అడ్వొకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి తదితరులతో తన నివాసంలో సమీక్ష నిర్వహించారు.

సుప్రీంకోర్టులో తీర్పు ఎలా వస్తుంది? అనే అంశంపై న్యాయవాదుల నుంచి అభిప్రాయాలు తెలుసుకున్నారని తెలుస్తోంది. ఎల్లుండి సుప్రీంకోర్టు తీర్పు దృష్ట్యా తదుపరి అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారని సమాచారం. తీర్పు ఎలా వచ్చినా అందుకు అనుగుణంగా అప్రమత్తంగా ఉండాలని డీజీపీని ఆదేశించారు. శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. స్కిల్ డెవలప్‌మెంట్ కేసుతో పాటు ఏపీ ఫైబర్ నెట్, ఇన్నర్ రింగ్ రోడ్డు కేసుల అంశంపై కూడా చర్చించారు.
YS Jagan
Chandrababu
Andhra Pradesh

More Telugu News