Rohit Sharma: స్పోర్ట్స్ కారులో హైవేపై దూసుకెళ్లిన రోహిత్ శర్మ,... మూడు చలాన్లు వేసిన పోలీసులు!

  • రేపు వరల్డ్ కప్ లో బంగ్లాదేశ్ తో ఆడనున్న టీమిండియా
  • పూణేలో జరగనున్న మ్యాచ్
  • జట్టుతో కలిసేందుకు ముంబయి నుంచి పూణే బయల్దేరిన రోహిత్ శర్మ
  • లాంబోర్ఘిని కారులో 200 కి.మీ పైచిలుకు వేగంతో దూసుకెళ్లిన వైనం
Rohit Sharma reportedly fined with three challans

బ్యాటింగ్ లో ఎప్పుడు ఏ గేరు మార్చి ఎలా దూసుకుపోవాలో తెలిసిన టీమిండియా సారథి రోహిత్ శర్మ హైవే పైనా అదే విధంగా దూసుకెళ్లి చిక్కుల్లో పడ్డాడు. పూణేలో రేపు భారత జట్టు బంగ్లాదేశ్ తో ఆడనుంది. ఈ మ్యాచ్ కోసం జట్టుతో కలిసేందుకు రోహిత్ శర్మ ముంబయి నుంచి తన లాంబోర్ఘిని కారులో పూణే బయల్దేరాడు. 

అయితే హైవేపై రోహిత్ శర్మ గంటకు 200 కిలోమీటర్లకు పైగా వేగంతో వెళ్లినట్టు స్పీడ్ గన్ లు గుర్తించాయి. ఓ దశలో రోహిత్ శర్మ కారు గంటకు 215 కిలోమీటర్ల వేగాన్ని అందుకున్నట్టు 'పూణే మిర్రర్' మీడియా సంస్థ పేర్కొంది. ఈ నేపథ్యంలో, ట్రాఫిక్ పోలీసులు రోహిత్ శర్మకు మూడు చలాన్లు వేశారని కూడా సదరు మీడియా సంస్థ వెల్లడించింది. 

రోహిత్ శర్మ డ్రైవింగ్ పై ట్రాఫిక్ విభాగం స్పందించింది. ఇలా హై స్పీడ్ లో వెళ్లేకంటే, టీమ్ బస్ లో పోలీస్ ఎస్కార్ట్ తో వెళ్లి ఉంటే బాగుండేదని ఉన్నతాధికారులు అభిప్రాయపడ్డారు.

More Telugu News