margadarshi: మార్గదర్శి క్వాష్ పిటిషన్‌పై విచారణను 8 వారాలు వాయిదా వేసిన హైకోర్టు

High Court postponed margadarshi quash petition for eight weeks
  • యూరిరెడ్డి ఫిర్యాదుపై సీఐడీ ఎఫ్ఐఆర్‌ను క్వాష్ చేయాలని హైకోర్టులో మార్గదర్శి పిటిషన్
  • ఈ పిటిషన్‌పై నేడు విచారణ జరిపిన హైకోర్టు
  • దర్యాఫ్తును ఎనిమిది వారాలు నిలిపివేస్తూ ఉత్తర్వులు
  • కౌంటర్ దాఖలు చేయాలని యూరిరెడ్డి, సీఐడీకి నోటీసులు
మార్గదర్శి క్వాష్ పిటిషన్‌పై విచారణను ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఎనిమిది వారాలు వాయిదా వేసింది. యూరిరెడ్డి ఫిర్యాదుపై సీఐడీ ఎఫ్ఐఆర్‌ను క్వాష్ చేయాలని హైకోర్టులో మార్గదర్శి పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్‌పై బుధవారం విచారణ జరిపిన న్యాయస్థానం... యూరిరెడ్డి ఫిర్యాదుపై సీఐడీ దర్యాఫ్తును ఎనిమిది వారాలు నిలిపివేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కౌంటర్ దాఖలు చేయాలని యూరిరెడ్డి, సీఐడీకి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను డిసెంబర్ 6వ తేదీకి వాయిదా వేసింది.
margadarshi
Andhra Pradesh
AP High Court

More Telugu News