Jio: ఇక జియో నుంచి డెబిట్ కార్డులు

  • ఆర్థిక సేవల రంగంలోనూ జియో విస్తరణ
  • ఇప్పటికే పేమెంట్స్ బ్యాంక్ కార్యకలాపాలు
  • సేవింగ్స్ ఖాతాలు, బిల్ పేమెంట్స్ కు తోడు ఇకపై డెబిట్ కార్డులు
Jio set to launch debit cards

రిలయన్స్ ఆధ్వర్యంలోని జియో పలు రూపాల్లో విస్తరిస్తోంది. టెలికాం రంగంలో అడుగుపెట్టి విప్లవాత్మకమైన మార్పులు తీసుకువచ్చిన జియో ఆ తర్వాత వినోదం, రిటైల్ అమ్మకాల వైపు కూడా అడుగులు వేసింది. కొన్నాళ్ల కిందట చెల్లింపుల (పేమెంట్స్) రంగంలోనూ కాలు మోపిన జియో... త్వరలోనే డెబిట్ కార్డులు తీసుకువస్తోంది. 

ఇప్పటికే సేవింగ్స్ అకౌంట్లు, బిల్ పేమెంట్ సేవలు అందిస్తున్న జియో కంపెనీ పేమెంట్స్ బ్యాంక్ విభాగం జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ డెబిట్ కార్డులు తీసుకువచ్చేందుకు సన్నాహాలు చేస్తోంది. అంతేకాదు, వాహన రుణాలు, గృహ రుణాలు కూడా మంజూరు చేసేందుకు కసరత్తులు చేస్తోంది. మొత్తమ్మీద పూర్తి స్థాయి ఆర్థిక వ్యవహారాల సంస్థగా ఏర్పడాలన్నది జియో పైనాన్షియల్ సర్వీసెస్ ప్రణాళికగా కనిపిస్తోంది. 

జియో తాజాగా దేశంలోని ఆర్థిక విశ్లేషకుల కోసం ముంబయిలో ప్రత్యేక ప్రజెంటేషన్ ఏర్పాటు చేసింది. ఇకపై స్వయం ఉపాధి పొందుతున్న వ్యక్తులకు వ్యాపార, వాణిజ్య రుణాలను కూడా ఇవ్వాలని నిర్ణయించామని జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ తెలిపింది. జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ కు చెందిన స్టాక్ మార్కెట్ పెట్టుబడుల విభాగం ఇప్పటికే 24 బీమా కంపెనీలతో భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఆస్తి నిర్వహణ సేవల కోసం అమెరికాకు చెందిన ఇన్వెస్ట్ మెంట్ మేనేజ్ మెంట్ కంపెనీ బ్లాక్ రాక్ తోనూ ఒప్పందం కుదుర్చుకుంది.

More Telugu News