Tarun Bhaskar: కూల్ డ్రింకులో బొద్దింక: 'కీడా కోలా' .. ట్రైలర్ రిలీజ్!

  • తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో 'కీడాకోలా'
  • క్రైమ్ కామెడీ జోనర్లో నడిచే కథ 
  • సంగీతాన్ని సమకూర్చిన వివేక్ సాగర్
  • నవంబర్ 3వ తేదీన సినిమా విడుదల  
Keedaa Cola movie trailer released

తరుణ్ భాస్కర్ పేరు వినగానే ఆయన దర్శకత్వంలో వచ్చిన 'పెళ్లిచూపులు' .. 'ఈ నగరానికి ఏమైంది'  అనే సినిమాలు గుర్తుకు వస్తాయి. ఆ తరువాత ఆయన నటుడిగా బిజీ కావడం వలన, దర్శకుడిగా కొంత గ్యాప్ వచ్చింది. ఈ నేపథ్యంలో తాజాగా ఆయన దర్శకత్వం వహిస్తూ .. నటించిన సినిమానే 'కీడా కోలా'.

వివేక్ సుధాన్షు - శ్రీకృష్ణ నిర్మించిన ఈ సినిమాను, నవంబర్ 3వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమా నుంచి ట్రైలర్ ను రిలీజ్ చేశారు. ఇద్దరు ప్రధాన పాత్రధారులకు ఆర్థికపరమైన ఇబ్బందులు ఉండటం .. కూల్ డ్రింక్ లో ఉన్న బొద్దింక వాళ్ల కంటపడటం అనే అంశం చుట్టూ ఈ కథ తిరుగుతుంది. 

  చైతన్య రావు .. రాగ్ మయూర్ ప్రధానమైన పాత్రలను పోషించిన ఈ సినిమాలో, తరుణ్ భాస్కర్ ఒక కీలకమైన పాత్రను పోషించాడు. క్రైమ్ కామెడీ జోనర్లో నడిచే ఈ సినిమాలో బ్రహ్మానందం ముఖ్యమైన పాత్రను పోషించారు. వివేక్ సాగర్ సంగీతాన్ని అందించిన ఈ సినిమాను, రానా సమర్పిస్తూ ఉండటం విశేషం.

More Telugu News