Chatrapathi movie: 23న థియేటర్ల ముందుకు ‘ఛత్రపతి’

  • ప్రభాస్ పుట్టిన రోజు నాడు ముహూర్తం
  • దేశవ్యాప్తంగా 4కే వెర్షన్ లో విడుదల
  • 2005లో విడుదలై సూపర్ హిట్ చూసిన సినిమా
Prabhas super hit Chatrapathi locks its re release

ప్రభాస్, శ్రియా శరణ్ నటించిన బ్లాక్ బస్టర్ మూవీ ‘ఛత్రపతి’ మరో సారి ప్రేక్షకుల ముందుకు వస్తోంది. దీన్ని ఈ నెల 23న దేశవ్యాప్తంగా విడుదల చేయనున్నారు. రాజమౌళి తీసిన ఈ సినిమా 2005లో విడుదలై సూపర్ హిట్ కావడం ప్రేక్షకులకు గుర్తుండే ఉంటుంది. 18 ఏళ్ల తర్వాత తిరిగి ఈ సినిమాను మరోసారి విడుదల చేయడానికి ఏర్పాట్లు చేశారు. ప్రభాస్ కు ఈ సినిమాతో మంచి గుర్తింపు రావడం తెలిసిందే.


ప్రభాస్ పుట్టిన రోజు సందర్భంగా ఈ నెల 23న సినిమా విడుదలకు రంగం సిద్ధం చేశారు. దీనిని 4కే వెర్షన్ లో తీసుకొస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించి బుకింగ్ లను కూడా త్వరలోనే ప్రారంభించనున్నారు. భాను ప్రియ, ప్రదీప్ రావత్, కోట శ్రీనివాసరావు, జైప్రకాష్ రెడ్డి ఈ సినిమాలో ప్రధాన పాత్రలు పోషించారు. ఎంఎం కీరవాణి సంగీతం అందించగా, బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మాతగా ఉన్నారు.

More Telugu News