Revanth Reddy: రేవంత్ రెడ్డిని అదుపులోకి తీసుకున్న పోలీసులు

Revanth Reddy arrested by TS police
  • మద్యం, డబ్బు పంపిణీ చేయకుండా ఎన్నికలకు వెళ్దామన్న రేవంత్
  • అమరవీరుల స్థూపం వద్ద ప్రమాణం చేద్దామని సవాల్
  • గన్ పార్క్ వద్దకు వచ్చిన రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు
  • పోలీసులతో వాగ్వాదం, తోపులాట
మద్యం, డబ్బు పంపిణీ చేయకుండా ఎన్నికలకు వెళ్దామంటూ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు టీపీసీసీ చీఫ్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఇటీవల సవాల్ విసిరారు. ఇందుకోసం అమరవీరుల స్థూపం వద్ద ప్రమాణం చేద్దామని చెప్పారు. ఈ క్రమంలో ఆయన మంగళవారం మధ్యాహ్నం గన్ పార్క్ వద్దకు వచ్చారు. దీంతో అక్కడ ఉద్రిక్తత చోటు చేసుకుంది.

ముఖ్యమంత్రి కేసీఆర్ తన సవాల్‌ను స్వీకరించి ప్రమాణం చేసేందుకు గన్ పార్క్ వద్దకు రావాలన్నారు. అయితే ఆయనను పోలీసులు అడ్డుకున్నారు. పోలీసులకు, కాంగ్రెస్ నేతలకు మధ్య వాగ్వాదం, తోపులాట జరిగింది. అనంతరం పోలీసులు రేవంత్ రెడ్డిని, ఇతర కాంగ్రెస్ నేతలను అదుపులోకి తీసుకున్నారు.
Revanth Reddy
Congress
Telangana

More Telugu News