satyasai district: టీచర్ నిర్వాకంతో తల్లి అయిన పదో తరగతి విద్యార్థిని.. సత్యసాయి జిల్లాలో దారుణ ఘటన!

High School Student  delivered baby boy in Satyasai District
  • బాలికను బెదిరించి పలుమార్లు అత్యాచారం చేసిన ఉపాధ్యాయుడు
  • ఎవరికైనా చెబితే చంపేస్తానంటూ హెచ్చరించడంతో మౌనంగా భరించిన బాలిక
  • కడుపు నొప్పి రావడంతో ఆసుపత్రికి తీసుకెళ్లగా బిడ్డకు జన్మనిచ్చిన వైనం
  • టీచర్ ను అరెస్టు చేసి విచారిస్తున్న పోలీసులు
ఒంటరిగా కనిపించిన విద్యార్థినిపై ఓ ఉపాధ్యాయుడు అఘాయిత్యానికి పాల్పడ్డాడు.. ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించడంతో భయపడిన విద్యార్థిని మౌనంగా ఉండిపోయింది. దీనిని అవకాశంగా తీసుకున్న ఆ ప్రబుద్ధుడు బాలికపై పలుమార్లు అత్యాచారం చేశాడు. దీంతో గర్భం దాల్చిన విషయం కూడా గుర్తించని ఆ బాలిక కడుపు నొప్పితో ఆసుపత్రికి వెళ్లి మగబిడ్డకు జన్మనిచ్చింది. దీంతో ఉపాధ్యాయుడి నిర్వాకం వెలుగులోకి వచ్చింది. సత్యసాయి జిల్లాలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వివరాలు..

జిల్లాలోని కదిరి నియోజకవర్గంలో ఓ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో రెడ్డి నాగయ్య ఉపాధ్యాయుడు. తొమ్మిది నెలల క్రితం స్కూలులోని స్టాఫ్ రూమ్ లో పదో తరగతి విద్యార్థినిపై అత్యాచారం చేశాడు. నీళ్లు తాగేందుకు వచ్చిన బాధితురాలిపై ఒంటరిగా ఉన్న రెడ్డి నాగయ్య ఈ దారుణానికి పాల్పడ్డాడు. ఈ విషయం ఎక్కడా చెప్పొద్దంటూ బెదిరించాడు. దీంతో బాధితురాలు మౌనంగా భరించింది. ఆ తర్వాత కూడా పలుమార్లు అత్యాచారం చేయడంతో బాలిక గర్భం దాల్చింది.

ఆ విషయాన్ని కూడా బాలిక గుర్తించలేదు. తాజాగా కడుపు నొప్పితో బాధపడుతున్న బాలికను కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తీసుకెళ్లగా.. అక్కడ మగ బిడ్డకు జన్మనిచ్చింది. దీనికి కారణం రెడ్డి నాగయ్య అని చెప్పడంతో కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితుడు రెడ్డి నాగయ్యపై పోక్సో చట్టం, 376, 506 సెక్షన్ల కింద కేసు నమోదు చేశామని, నిందితుడిని అరెస్టు చేసి విచారిస్తున్నామని కదిరి డీఎస్పీ శ్రీలత మీడియాకు వెల్లడించారు.
satyasai district
Crime News
student pregnancy
tenth student
delivery
Teacher raped student

More Telugu News