Chandrababu: చంద్రబాబు స్పెషల్ లీవ్ పిటిషన్ పై నేడు సుప్రీంకోర్టులో తుది వాదనలు

  • క్వాష్ పిటిషన్ ను హైకోర్టు కొట్టేయడంతో సుప్రీంలో పిటిషన్
  • విచారించనున్న జస్టిస్ అనిరుద్ధ బోస్, జస్టిస్ బేలా ఎం.త్రివేది ధర్మాసనం
  • టీడీపీ చీఫ్ తరఫున వాదనలు వినిపించనున్న హరీశ్ సాల్వే
chandrababu special leave petition in Supreme court

స్కిల్ డెవలప్ మెంట్ కేసులో చంద్రబాబు దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్ పై మంగళవారం (నేడు) మధ్యాహ్నం సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. గత శుక్రవారం ఈ కేసులో వాదనలు వినిపించిన ఏపీ ప్రభుత్వ న్యాయవాది ముకుల్ రోహత్గీ మరికొంత సమయం అడిగారు. దీంతో జస్టిస్ అనిరుద్ధ బోస్, జస్టిస్ బేలా ఎం.త్రివేదిల ధర్మాసనం కేసు విచారణను ఈ రోజుకు వాయిదా వేసింది. మధ్యాహ్నం 2 గంటలకు తొలుత ముకుల్ రోహత్గీ వాదనలు వినిపించాక చంద్రబాబు తరఫున న్యాయవాది హరీశ్ సాల్వే కౌంటర్ వాదనలు వినిపిస్తారు. ఈ రోజు సాయంత్రానికి ఈ కేసులో వాదనలు పూర్తయ్యే అవకాశం ఉందని సమాచారం. 

గవర్నర్ నుంచి ముందస్తు అనుమతి తీసుకోకుండా తనపై స్కిల్ డెవలప్ మెంట్ కేసు నమోదు చేశారని, ఈ కేసును కొట్టేయాలని ఏపీ హైకోర్టులో చంద్రబాబు క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. అయితే, ఈ పిటిషన్ ను హైకోర్టు తోసిపుచ్చడంతో చంద్రబాబు సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ వేశారు. అవినీతి నిరోధక చట్టం సెక్షన్ 17 ఏ ప్రకారం.. ముందుగా గవర్నర్ అనుమతి తప్పనిసరని, ఈ నిబంధనను సీఐడీ అధికారులు పాటించలేదని, నిబంధనలకు విరుద్ధంగా తనపై నమోదు చేసిన కేసును కొట్టి వేయాలని అత్యున్నత న్యాయస్థానానికి చంద్రబాబు విజ్ఞప్తి చేశారు.

More Telugu News