Chandrababu: టీడీపీ అధినేత చంద్రబాబు తాజా ఆరోగ్య బులెటిన్ విడుదల

  • రాజమండ్రి జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న చంద్రబాబు
  • చంద్రబాబును మరోసారి పరిశీలించిన ప్రభుత్వ వైద్యులు
  • చంద్రబాబు ఆరోగ్యం నిలకడగా ఉందని బులెటిన్ ద్వారా వెల్లడి
Chandrababu health bulletin releasd

టీడీపీ అధినేత చంద్రబాబు తాజా ఆరోగ్య బులెటిన్ ను రాజమండ్రి జైలు అధికారులు కొద్దిసేపటి కింద విడుదల చేశారు. రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు చంద్రబాబును పరిశీలించి ఇచ్చిన వివరాల మేరకు ఈ బులెటిన్ రూపొందించారు. ఈ బులెటిన్ లో చంద్రబాబు ఖైదీ నెంబరుతో పాటు, ఆయనను రిమాండ్ ముద్దాయిగా పేర్కొన్నారు. 

ఇక, బీపీ-130/80, శరీర ఉష్ణోగ్రత-నార్మల్, నాడి-64/మినిట్, శ్వాస-12/మినిట్, హార్ట్ రేట్-ఎస్1 , ఎస్2 , ఆక్సిజన్ శాచ్యురేషన్-గది వాతావరణం వద్ద 96 శాతం, ఊపిరితిత్తులు-క్లియర్, శారీరక క్రియాశీలత-బాగుంది, బరువు-67 కేజీలు అని వివరించారు. 

పై అంశాల ఆధారంగా చంద్రబాబు ఆరోగ్యం నిలకడగానే ఉందని బులెటిన్ లో స్పష్టం చేశారు.

More Telugu News