చంద్రబాబు అరెస్ట్‌పై మరోసారి స్పందించిన తలసాని శ్రీనివాస్ యాదవ్
- చంద్రబాబును అరెస్ట్ బాధ కలిగించిందన్న తెలంగాణ మంత్రి
- రాజకీయాల్లో వ్యక్తిగత ద్వేషాలు మంచిది కాదని వ్యాఖ్య
- ప్రేమపూర్వక రాజకీయాలు చేయాలని సూచన
సనత్ నగర్లో తలసాని పర్యటన
50 ఏళ్లలో జరగని అభివృద్ధిని తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తొమ్మిదేళ్లలోనే చేశామని మంత్రి తలసాని అన్నారు. సోమవారం ఆయన అధ్యక్షతన సనత్ నగర్ నియోజకవర్గ బీఆర్ఎస్ సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... దేశంలో ఎక్కడా లేనివిధంగా అనేక అభివృద్ధి, సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని, కాంగ్రెస్, బీజేపీ ఎన్ని జిమ్మిక్కులు చేసినా బీఆర్ఎస్దే విజయమన్నారు.
మనకు ఎవరు పోటీ కాదు, మనకు మనమే పోటీ అన్నారు. త్వరలో నామినేషన్ వేసి ఆ తర్వాత నియోజకవర్గంలో పాదయాత్ర ప్రారంభించనున్నట్లు తలసాని తెలిపారు. బీఆర్ఎస్ శ్రేణులు ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. విభేదాలకు తావులేకుండా కలిసికట్టుగా పార్టీ విజయానికి కృషి చేయాలని నియోజకవర్గ నేతలకు పిలుపునిచ్చారు.