Prabhas: ప్రభాన్ ఇన్ స్టా అకౌంట్ కు ఏమైంది?

Prabhas Instagram account vanishes overnight Hacking or deactivation
  • రాత్రికి రాత్రే మాయమైన అకౌంట్
  • హ్యాకింగ్ కు గురైందా అన్న అనుమానం
  • ప్రభాస్ తో పాటు మరికొందరికీ ఇదే అనుభవం
ప్రముఖ నటుడు ప్రభాస్ ఇన్ స్టా గ్రామ్ అకౌంట్ కనిపించడం లేదు..? రాత్రికి రాత్రే ఇది కనిపించకుండా పోయింది. దీంతో అభిమానులు, పరిశ్రమలో పెద్ద చర్చకు దారితీసింది. ఏదైనా హ్యాకింగ్ దాడికి గురైందా..? లేక ప్రభాస్ తనంతట తానే డీయాక్టివేట్ చేశాడా? అన్న ఆసక్తి నెలకొంది. ప్రభాస్ ఇన్ స్టా గ్రామ్ ఖాతా డీయాక్టివేట్ అయిన విషయం బాగానే ప్రచారంలోకి వచ్చింది.

ఒక్క ప్రభాస్ అనే కాకుండా, మరికొందరి సెలబ్రిటీల ఇన్ స్టా గ్రామ్ ఖాతాలు సైతం కనిపించకుండా పోయిన విషయం వెలుగు చూసింది. దీంతో ఇన్ స్టా గ్రామ్ లో గోప్యత, భద్రతకు భరోసా లేదంటూ కొందరు యూజర్లు ప్రచారం మొదలు పెట్టేశారు. ప్రభాస్ చాలా రిజర్వ్ డ్. బయట మీడియాతో మాట్లాడడం చాలా అరుదు. అదే విధంగా సామాజిక మాధ్యమాల్లోనూ ఆయన పరిమితంగానే కనిపిస్తుంటారు. ప్రధానంగా గోప్యతను కోరుకోవడాన్ని గమనించొచ్చు.
Prabhas
Instagram
vanished
disappear
Hacking

More Telugu News