Chandrababu: చంద్రబాబు ఆరోగ్య బులెటిన్ విడుదల చేసిన జైలు అధికారులు

Jail officials releases Chandrababu health bulletin
  • జైల్లో డీహైడ్రేషన్, అలర్జీకి గురైన చంద్రబాబు
  • చంద్రబాబు ఆరోగ్యం నిలకడగానే ఉందని బులెటిన్ లో వెల్లడి
  • చంద్రబాబు ప్రస్తుతం 67 కేజీల బరువున్నారని వివరణ
రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబు విపరీతమైన వేడిమి, ఉక్కపోత కారణంగా డీహైడ్రేషన్, అలర్జీకి గురవడం తెలిసిందే. ఈ నేపథ్యంలో, చంద్రబాబు ఆరోగ్యంపై జైలు అధికారులు ప్రత్యేక బులెటిన్ విడుదల చేశారు. 

కోర్టు ఆదేశాల మేరకు చంద్రబాబు ఉన్న బ్యారక్ లో టవర్ ఏసీ ఏర్పాటు చేసినట్టు వెల్లడించారు. చంద్రబాబు ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉందని తెలిపారు. చంద్రబాబు 67 కేజీల బరువు ఉన్నారని పేర్కొన్నారు. 

స్కిల్ కేసులో అరెస్టయిన చంద్రబాబుకు ఏసీబీ కోర్టు రిమాండ్ విధించగా, ఆయనను రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు. అయితే, ఇటీవల వేడి వాతావరణంతో ఆయన ఆరోగ్య పరిస్థితిలో మార్పులు వచ్చాయి. జైలు వైద్యాధికారితో పాటు రాజమండ్రి ప్రభుత్వాసుపత్రి వైద్యులు కూడా చంద్రబాబును పరిశీలించారు. చంద్రబాబు ఆరోగ్యంపై నివేదికను కోర్టుకు సమర్పించారు. చంద్రబాబుకు చల్లని వాతావరణం అవసరమని వైద్యులు సిఫారసు చేయగా, ఏసీబీ కోర్టు చంద్రబాబుకు ఏసీ సౌకర్యం అమర్చాలని ఆదేశాలు జారీ చేసింది.
Chandrababu
Health Bulletin
Jail
Rajahmundry
TDP

More Telugu News