Gaanja Shankar: ఊరమాస్.. వచ్చేసిన సాయిధరమ్‌తేజ్ ‘గాంజా శంకర్’ ఫస్ట్ గ్లింప్స్

Sai Dharam Tej Character Revealed Ganja Shankar First Glimpse Out
  • సాయిధరమ్‌తేజ్-సంపత్ నంది కాంబినేషన్‌లో వస్తున్న సినిమా
  • ఊరమాస్ లుక్‌లో కనిపించిన సాయిధరమ్‌తేజ్
  • హీరో కేరెక్టర్‌ను రివీల్ చేసిన మేకర్స్
  • హీరోయిన్‌గా పూజాహెగ్డే పేరు పరిశీలన
సుప్రీంహీరో సాయిధరమ్‌తేజ్-సంపత్ నంది దర్శకత్వంలో వస్తున్న ‘గాంజా శంకర్’ సినిమా వీడియో గ్లింప్స్‌ను తాజాగా మేకర్స్ రిలీజ్ చేశారు. గతంలో ఎప్పుడూ లేనంత మాస్‌లుక్‌‌లో సాయిధరమ్‌తేజ్ కనిపించాడీ గ్లింప్స్‌‌లో. మాస్‌కు నిర్వచనం వద్దని, ఫీల్ అవమని చెబుతూ గ్లింప్స్‌ను మొదలుపెట్టారు. ‘స్పైడర్ మ్యాన్.. సూపర్ మ్యాన్ కాదు నాన్న.. మన లోకల్ మ్యాన్ కథ ఏదైనా ఉంటే చెప్పు’ అని చిన్నారి అడగడంతో ఇంట్రో మొదలైంది. 

ఫస్ట్ హైలోనే హీరో కేరెక్టర్‌ను మేకర్స్ రివీల్ చేసేశారు. చదువు మానేసి, చెప్పిన మాట వినకుండా పెడదారి పట్టినట్టు అర్థమవుతోంది. అంతేకాదు, జర్దా, గుట్కా, మద్యం వంటి అన్ని దరిద్రమైన అలవాట్లు ఉన్నట్టు కూడా చెప్పేశారు. హీరో గంజా స్మగ్లర్ అని కూడా టైటిల్‌ను బట్టి తెలుస్తోంది. తెలంగాణ నేపథ్యంలో కథ సాగుతున్నట్టుగా అనిపిస్తోంది.

సాయికి ఇది 17వ సినిమా. త్రివిక్రమ్ శ్రీనివాస్, సాయి సౌజన్య నిర్మాతగా ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్, సూర్యదేవర నాగవంశీ నిర్మాతగా సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థలు సంయుక్తగా ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. ఈ సినిమాలో హీరోయిన్ కోసం పూజాహెగ్డే పేరును పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది.
Gaanja Shankar
Sai Dharam Tej
Mega Hero
First Glimps

More Telugu News