నిరుపేద మహిళలకు నెలకు రూ. 3 వేల జీవనభృతి.. నేడు బీఆర్ఎస్ మ్యానిఫెస్టో విడుదల
- పూర్తి జనరంజకంగా మ్యానిఫెస్టో తయారీ
- రైతుబీమా కింద ఇస్తున్న రూ. 5 లక్షల పరిహారం అందరికీ వర్తింపు
- పింఛన్ రూ. 3,016కు పెంపు
- రైతుబంధు రూ. 16 వేలకు పెంపు
- ప్రతి సీజన్‌లో రెండు బస్తాల యూరియా ఉచితం
- వంటగ్యాస్ సిలిండర్‌పై రూ. 400 వరకు సబ్సిడీ
బయటకు వచ్చిన వివరాల ప్రకారం..
ప్రస్తుతం అమల్లో ఉన్న రైతుబీమా పరిహారం రూ. 5 లక్షలను రాష్ట్రంలోని 90 లక్షల పేద కుటుంబాలకు వర్తింపజేయనున్నారు. నిరుపేద మహిళలకు జీవనభృతిగా ప్రతినెల రూ. 3000 అందిస్తారు. ఇప్పటికే పెన్షన్ అందుతున్న మహిళలను ఇందులోంచి మినహాయిస్తారు. అలాగే, ప్రస్తుతం వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు తదితర వారికి ప్రస్తుతం అందిస్తున్న రూ. 2,016 పింఛన్‌ను రూ. 3,016కు పెంచుతారు.
జర్నలిస్టులకు ప్రత్యేక పెన్షన్ పథకం, రైతుబంధు సాయం రూ. 16 వేలకు పెంపు, ప్రతి సీజన్‌లో ఉచితంగా ఎకరానికి రెండు బస్తాల యూరియా, కల్యాణలక్ష్మి, షాదీముబారక్ కింద నిరుపేద కుటుంబాల్లో ఆడపిల్లల వివాహాలకు ఇస్తున్న ఆర్థికసాయం రూ. 1.25 లక్షలకు పెంపు, వంట గ్యాస్ సిలిండర్లపై రూ. 400 వరకు సబ్సిడీ, మహిళలకు రూ. 2 లక్షల మేర వడ్డీలేని రుణాలు, ఆరోగ్యశ్రీలో చికిత్స పరిమితి రూ. 10 లక్షలకు పెంపు, పెంట్రోలు, డీజిల్ ధరలపై రాష్ట్ర పన్ను వాటా కొంత మేర తగ్గింపు వంటివి ఉన్నాయి.