Chandrababu: జైల్లో చంద్రబాబుకు టవర్ ఏసీ... ఏసీబీ కోర్టు కీలక ఆదేశాలు

ACB court orders to arrange tower ac for Chandrababu
  • జైల్లో డీహైడ్రేషన్, అలర్జీతో బాధపడుతున్న చంద్రబాబు
  • చంద్రబాబుకు చల్లని వాతవరణం అవసరమని వైద్యుల సిఫారసు
  •  ఏసీబీ కోర్టును ఆశ్రయించిన చంద్రబాబు న్యాయవాదులు
  • వైద్యుల సూచనలు పాటించేలా చర్యలు తీసుకోవాలంటూ పిటిషన్
  • చంద్రబాబు బ్యారక్ లో చల్లని వాతావరణం ఉండేలా చూడాలన్న ఏసీబీ కోర్టు

టీడీపీ అధినేత చంద్రబాబుకు ఆరోగ్య రీత్యా చల్లని వాతావరణం అవసరమని వైద్యులు సిఫారసు చేయడం తెలిసిందే. ఈ నేపథ్యంలో, ఏసీబీ కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. రాజమండ్రి సెంట్రల్ జైలులో చంద్రబాబును ఉంచిన బ్యారక్ లో టవర్ ఏసీ ఏర్పాటు చేయాలని స్పష్టం చేసింది. వైద్యుల సూచనలకు అనుగుణంగా బ్యారక్ లో చల్లదనం ఉండేలా చర్యలు తీసుకోవాలని జైలు అధికారులను ఆదేశించింది. 

గత కొన్నిరోజులుగా విపరీతమైన ఉక్కపోత, అధిక ఉష్ణోగ్రతలతో చంద్రబాబు డీహైడ్రేషన్, అలర్జీతో బాధపడుతున్నారు. ఈ నేపథ్యంలో, టవర్ ఏసీ ఏర్పాటు చేయాలని కోర్టు ఇచ్చిన ఆదేశాలు చంద్రబాబుకు నిజంగా ఊరటే అని చెప్పాలి. వైద్యాధికారుల సిఫారసులు పాటించేలా చర్యలు తీసుకోవాలంటూ చంద్రబాబు తరఫు న్యాయవాదులు ఏసీబీ కోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News