Botsa Satyanarayana: చంద్రబాబు ఆరోగ్యంగా ఉండాలనే మేము కూడా కోరుకుంటున్నాం: బొత్స

We also wish for Chandrababu good health says Botsa
  • టీడీపీ నేతలు అసత్య ప్రచారం చేస్తున్నారన్న బొత్స
  • టీడీపీ అనుకూల మీడియాలో ఇష్టం వచ్చినట్టు ప్రచారం చేస్తున్నారని మండిపాటు
  • ఆరోగ్యం బాగోలేకపోతే కోర్టుకు విన్నవించుకోవాలని వ్యాఖ్య
చంద్రబాబు ఆరోగ్యంపై టీడీపీ అనుకూల మీడియాలో ఇష్టం వచ్చినట్టు కథనాలను ప్రసారం చేస్తున్నారని మంత్రి బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. టీడీపీ నేతలు చేస్తున్నవన్నీ అసత్య ప్రచారాలని అన్నారు. చంద్రబాబు ఆరోగ్యం బాగోలేదని ఆయన కుటుంబ సభ్యులకు అనిపిస్తే... ఆ విషయాన్ని కోర్టుకు విన్నవించుకోవాలని చెప్పారు. రాజకీయ లబ్ధి కోసమే చంద్రబాబు ఆరోగ్యం బాగోలేదని ప్రచారం చేస్తున్నారని అన్నారు. 

తనకు చంద్రబాబు అభిమాని ఒకరు ఫోన్ చేయడం, ఏడవటం... దీన్ని ఒక ఛానల్ టెలికాస్ట్ చేయడం సానుభూతి కోసం కాదా? అని ప్రశ్నించారు. చంద్రబాబు ఆరోగ్యంగా ఉండాలనే తాము కూడా కోరుకుంటామని చెప్పారు. గిమ్మిక్కులు చేస్తే నష్టపోయేది టీడీపీనే అని అన్నారు. చంద్రబాబు తప్పు చేశారు కాబట్టే అరెస్ట్ అయ్యారని చెప్పారు.
Botsa Satyanarayana
YSRCP
Chandrababu
Telugudesam

More Telugu News