Nara Lokesh: హుటాహుటిన ఢిల్లీ నుంచి రాజమండ్రికి నారా లోకేశ్

Nara Lokesh going to Rajahmundry
  • ఉదయం 9 గంటలకు విజయవాడకు చేరుకున్న లోకేశ్
  • అక్కడి నుంచి రోడ్డు మార్గంలో రాజమండ్రికి పయనం
  • చంద్రబాబు ఆరోగ్యం నేపథ్యంలోనే ఢిల్లీ నుంచి వచ్చినట్టు సమాచారం
టీడీపీ యువనేత నారా లోకేశ్ ఢిల్లీ నుంచి హుటాహుటిన విజయవాడకు వచ్చారు. ఉదయం 9 గంటలకు గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి కొల్లు రవీంద్ర, పెద్ద సంఖ్యలో టీడీపీ నేతలు, కార్యకర్తలు స్వాగతం పలికారు. గన్నవరం ఎయిర్ పోర్టు నుంచి లోకేశ్ నేరుగా రాజమండ్రికి బయల్దేరారు. మరోవైపు చంద్రబాబు ఆరోగ్యంపై టీడీపీ శ్రేణుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. ఆయన 5 కిలోల బరువు తగ్గారని ఆయన భార్య నారా భువనేశ్వరి ఆందోళన వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. 

చంద్రబాబుకు స్టెరాయిడ్స్ ఇచ్చి ఆయన ఆరోగ్యాన్ని దెబ్బతీసే కుట్రలు జరుగుతున్నాయని అచ్చెన్నాయుడు ఆరోపించారు. తన తండ్రి ఆరోగ్యం నేపథ్యంలోనే లోకేశ్ ఢిల్లీ నుంచి హుటాహుటిన వచ్చినట్టు తెలుస్తోంది. మరోవైపు రాజమండ్రిలోని క్యాంప్ ఆఫీసులో టీడీపీ కీలక నేతలతో లోకేశ్ భేటీ అవనున్నారు. భవిష్యత్ కార్యాచరణపై చర్చించనున్నారు.
Nara Lokesh
Telugudesam
Chandrababu
Delhi
Rajahmundry

More Telugu News