హైదరాబాద్ నుంచి వెళ్తుండగా వైఎస్ విజయమ్మకు తప్పిన ప్రమాదం!
- కారు డ్రైవర్ సడన్‌గా బ్రేక్ వేయడంతో ఢీకొన్న కార్లు
- దెబ్బతిన్న కారు వెనుక భాగం
- ఫోన్ చేసి వివరాలు అడిగిన జగన్, షర్మిల
ఈ ప్రమాదంలో ఆమె ప్రయాణిస్తున్న కారు వెనుక భాగం దెబ్బతింది. అయితే ఈ ఘటనలో విజయమ్మకు, కారులో ప్రయాణిస్తున్న ఇతరులకు ఎలాంటి ప్రమాదం జరగలేదు. అనంతరం అదే కారులో ఆమె ఒంగోలుకు చేరుకున్నారు. ప్రమాదం విషయం తెలుసుకున్న తనయుడు జగన్, కూతురు షర్మిల ఆమెకు ఫోన్ చేసి వివరాలు తెలుసుకున్నారు.