Leo: 'లియో' సాంగులో కొరియోగ్రఫీనే హైలైట్!

  • విజయ్ హీరోగా రూపొందిన 'లియో'
  • ఆయన సరసన నాయికగా మెరవనున్న త్రిష 
  • సంగీతాన్ని అందించిన అనిరుధ్
  • ఈ నెల 19న పాన్ ఇండియా రిలీజ్  
Leo movie song released

విజయ్ - లోకేశ్ కనగరాజ్ కాంబినేషన్లో 'లియో' సినిమా రూపొందింది. సెవెన్ స్క్రీన్ స్టూడియోస్ బ్యానర్ పై నిర్మితమైన ఈ సినిమాను, ఈ నెల 19వ తేదీన పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ చేస్తున్నారు. త్రిష కథానాయికగా నటించిన ఈ సినిమాలో, సంజయ్ దత్ కీలకమైన పాత్రను పోషించారు. 

సితార బ్యానర్ వారు ఈ సినిమాను తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఈ సినిమా నుంచి కొంతసేపటి క్రితం 'నే రెడీరా వచ్చేయనా .. రాయల్ గా ఎంట్రీనే ఇచ్చేయనా' అంటూ సాగే తెలుగు వెర్షన్ సాంగ్ ను రిలీజ్ చేశారు. అనిరుధ్ స్వరపరిచిన ఈ బాణీకి రఘురామ్ సాహిత్యాన్ని అందించగా, రేవంత్ ఆలపించాడు. 

జోరుగా .. హుషారుగా సాగే బీట్ ఇది. ఈ పాటకు దినేశ్ మాస్టర్ కొరియోగ్రఫీని అందించాడు. విజయ్ ప్రధానంగా డాన్సర్ల బృందం పై చిత్రీకరించిన పాట ఇది. విజయ్ స్టైల్ ను దృష్టిలో పెట్టుకుని దినేశ్ మాస్టర్ కంపోజ్ చేసిన స్టెప్స్ బాగున్నాయి. విజయ్ మాస్ ఇమేజ్ కి తగినట్టుగానే ఈ పాట ఉండటం విశేషం.

More Telugu News