Vijayasai Reddy: చంద్రబాబుకు ప్రాణహాని ఉందా? జైల్లో హాయిగా, ఆరోగ్యంగా ఉన్నారు!: విజయసాయిరెడ్డి

VijayaSaiReddy on chandrababu health condition
  • మాజీ సీఎంలు, మంత్రులు చాలామంది జైలుకు వెళ్లారన్న విజయసాయిరెడ్డి
  • కానీ అచ్చన్నలా ఏ పార్టీ వాళ్లు ఇలా దిగజారుడు ఆరోపణలు చేయలేదని విమర్శ
  • మెప్పు కోసం ఏదో ఒకటి చెప్పి మానసిక క్షోభకు గురి చేయవద్దని హితవు
స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో అరెస్టై రాజమండ్రి కేంద్రకారాగారంలో ఉన్న టీడీపీ అధినేత నారా చంద్రబాబు ఆరోగ్యంపై ఆయన కుటుంబ సభ్యులు తెలుగుదేశం కేడర్ ఆందోళన వ్యక్తం చేస్తోంది.     చంద్రబాబు ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉందనే సమాచారం తమకు తెలిసిందని, ఆయన ఆరోగ్య పరిస్థితిని బహిర్గతం కానివ్వడం లేదని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి ఎక్స్ వేదికగా తీవ్రంగా స్పందించారు.

మాజీ ముఖ్యమంత్రులు, మంత్రులు చాలామంది జైలుకు వెళ్లారని, కానీ అచ్చన్నలా ఏ పార్టీ వాళ్ళూ ఇలా దిగజారుడు ఆరోపణలు చేయలేదని మండిపడ్డారు. కారాగారంలో ఆయనకు (చంద్రబాబుకు) ప్రాణహాని ఉందా? లోపల ఆయన హాయిగా,  ఆరోగ్యంగా ఉన్నారని డాక్టర్లు చెప్పారని పేర్కొన్నారు. మెప్పుకోసం మీరు ఏదో ఒకటి చెప్పి మానసిక క్షోభకు గురిచేయకండని సూచించారు. ఇంటి భోజనంతో కూడా వెయిట్ లాస్ ఎలా అయ్యారో మీరే చెప్పాలన్నారు.
Vijayasai Reddy
Andhra Pradesh
Chandrababu
Atchannaidu

More Telugu News