Egg: ఒక కోడిగుడ్డు.. మీ ఆరోగ్యాన్నే మార్చేస్తుంది!

  • కోడిగుడ్డులో విటమిన్ డీ, ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్స్
  • హార్మోన్ల సక్రమ పనితీరుకు సాయం
  • కళ్లు, గుండె ఆరోగ్యానికి మేలు
  • వృద్ధులు సైతం గుడ్డును తీసుకోవచ్చు
Impressive Health Benefits Of Eggs

కోడిగుడ్డును రోజువారీ ఆహారంలో భాగంగా తీసుకోవడం వల్ల ఎన్నో విలువైన ఆరోగ్య ప్రయోజనాలు సమకూరతాయని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. మరెన్నో ఆహార పదార్థాలు ఇవ్వలేని ప్రయోజనాలను ఒక కోడి గుడ్డు ఇస్తుంది. కోడిగుడ్లలో ప్రొటీన్లు, సిలీనియం, విటమిన్లు వంటి ఎన్నో విలువైన పోషకాలు ఉంటాయి. ఇందులో కొవ్వులు ఉన్నప్పటికీ, దీన్ని తినేందుకు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఇప్పటి వరకు ఎన్నో పరిశోధనలు సైతం స్పష్టం చేశాయి. కోడిగుడ్డును రోజువారీ తీసుకోవం వల్ల ఒనగూరే ప్రయోజనాలేంటో చూద్దాం.


  • హై డెన్సిటీ లిపోప్రొటీన్ పెరుగుతుంది. దీన్ని మంచి కొలెస్ట్రాల్ గా చెబుతారు. అందుకే కోడిగుడ్డును తినడం వల్ల గుండెకు వచ్చే నష్టం ఉండదు. లో డెన్సిటీ లిపోప్రొటీన్ ను హానికరమైన కొవ్వుగా చెబుతారు. గుండెకు హాని దీనివల్లే ఏర్పడుతుంది.
  • గుడ్డులోని పచ్చసొనలో విటమిన్ డీ ఉంటుంది. రోజువారీ ఎండలో తగినంత సమయం గడిపే వారికి విటమిన్ డీ లోపం ఉండదు. కానీ, కార్యాయాలు, ఫ్యాక్టరీల్లో పనిచేసే వారికి, ఇంట్లో గృహిణులకు విటమిన్ డీ లోపం ఎక్కువగా ఉంటుంది. అలాంటి వారికి కోడిగుడ్డు ఒక మంచి పరిష్కారం. రెండు కోడిగుడ్లు తీసుకుంటే ఒక రోజులో కావాల్సిన విటమిన్ డీలో 82 శాతం సమకూరుతుంది. 
  • ఆహారం నుంచి క్యాల్షియం తగినంత గ్రహించేందుకు విటమిన్ డీ అవసరం. ఎముకలు బలంగా ఉండేందుకు, వ్యాధి నిరోధక శక్తి బలంగా ఉండేందుకు సైతం కావాలి.
  • కోడిగుడ్డులో కేలరీలు తక్కువ. ప్రొటీన్ ఎక్కువ. కనుక బరువు నియంత్రణకు సాయపడుతుంది. గుడ్డును తీసుకోవడం వల్ల హార్మోన్ల పనితీరు కూడా మెరుగుపడుతుంది. జీవక్రియలు మెరుగుపడతాయి. శరీరానికి శక్తి లభిస్తుంది. 
  • కోడిగుడ్లలో కొలిన్ కూడా ఉంటుంది. కొలిన్ కాలేయంలో తయారవుతుంది. కణాలు మంచిగా పనిచేసేందుకు ఇది కావాలి. గర్భస్థ శిశువు మెదడు, వెన్నెముక అభివృద్ధికి ఇది చాలా అవసరం. 
  • కోడిగుడ్డులో గుండెకు మంచి చేసే ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్స్ కూడా ఉంటాయి. గుండె, మెదడు, కంటి ఆరోగ్యానికి ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్స్ సాయపడతాయి.
  • కోడిగుడ్లలో విటమన్ ఏ, ఈ, సిలీనియం ఉంటాయి. లూటిన్, జియాక్సాంతిన్ కూడా ఉంటాయి. కళ్ల ఆరోగ్యాన్ని ఇవి రక్షిస్తాయి.
  • ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలను ఇస్తుంది కనుక పిల్లల నుంచి వృద్ధుల వరకు నిత్యం కోడిగుడ్డును తీసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.

More Telugu News