Retail Inflation: దేశంలో దిగొచ్చిన చిల్లర ద్రవ్యోల్బణం

  • ఆగస్టులో 6.83 శాతంగా ఉన్న చిల్లర ద్రవ్యోల్బణం
  • టమాటాల ధరలతో ఆకాశానికెగిసిన ద్రవ్యోల్బణం
  • అదుపులోకి వచ్చిన ధరలు... ఆరోగ్యకర స్థితికి చిల్లర ద్రవ్యోల్బణం
Retail Inflation dips for normal condition

దేశంలో ధరల పెరుగుదలతో జులైలో చిల్లర ద్రవ్యోల్బణం ఆకాశాన్నంటిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా టమాటా ధరలు భగ్గుమనడంతో, అవి లేకుండానే వంట చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే ఇప్పుడా పరిస్థితి లేదు. టమాటా ధరలు సాధారణ స్థితికి వచ్చేశాయి. ఆగస్టులో 6.83 శాతంగా ఉన్న చిల్లర ద్రవ్యోల్బణం, సెప్టెంబరు కల్లా దిగొచ్చింది. సెప్టెంబరులో చిల్లర ద్రవ్యోల్బణం 5.02 శాతంగా నమోదైంది. 

జూన్ లో 4.87 శాతంగా ఉన్న ద్రవ్యోల్బణం ఒక్కసారిగా పెరిగిపోయింది. అయితే, కేంద్రం చేపట్టిన చర్యలతో కొన్ని నెలల్లోనే పరిస్థితి అదుపులోకి వచ్చింది. 6 శాతం చిల్లర ద్రవ్యోల్బణం దేశ ఆర్థిక వ్యవస్థకు ఆరోగ్యకరం అని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా  పేర్కొంది. ఆర్బీఐ నిర్దేశించిన పరిధిలోకి చిల్లర ద్రవ్యోల్బణం దిగి రావడం శుభసూచకంగా ఆర్థిక నిపుణులు పేర్కొంటున్నారు.

More Telugu News