Rajeev Kanakala: తారక్ సినిమాలపైనే దృష్టి కేంద్రీకరించాడు... అందుకే చంద్రబాబు అరెస్ట్ పై స్పందించలేదనుకుంటా: రాజీవ్ కనకాల

Rajeev Kanakala opines on Jr NTR not responding to Chandrababu arrest

  • చంద్రబాబు అరెస్ట్ పై ఒక్క కామెంట్ కూడా చేయని జూనియర్ ఎన్టీఆర్
  • కనీసం సోషల్ మీడియాలోనూ స్పందించని వైనం
  • తారక్ సినిమాలతో బిజీగా ఉన్నాడన్న రాజీవ్ కనకాల

టీడీపీ అధినేత చంద్రబాబు స్కిల్ కేసులో అరెస్ట్ కావడం పట్ల జూనియర్ ఎన్టీఆర్ ఇప్పటికీ బాహాటంగా స్పందించకపోవడం చర్చనీయాంశం అయింది. దీనిపై ఎన్టీఆర్ స్నేహితుడు రాజీవ్ కనకాల ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 

చంద్రబాబు అరెస్ట్ విషయంలో ఎన్టీఆర్ వైఖరి ఏమిటి? అనే ప్రశ్నకు ఆయన స్పందిస్తూ, బహుశా సినిమాల వల్లే తారక్ ఈ విషయంలో స్పందించకపోయి ఉండొచ్చని అభిప్రాయపడ్డారు. 

"ఆర్ఆర్ఆర్ సినిమాకు చాలా సమయం కేటాయించిన తారక్... ఆ సమయంలో మూడ్నాలుగు సినిమాలు చేసి ఉండేవాడు. తారక్ ప్రస్తుతం 'దేవర'తో బిజీగా ఉన్నాడు... ఆ సినిమా కూడా రెండు భాగాలుగా వస్తోందంటున్నారు. దాంతో తారక్ తన దృష్టంతా సినిమాలపైనే కేంద్రీకరించాడు. అందుకే రాజకీయాలపై స్పందించలేదని భావిస్తున్నా" అని రాజీవ్ విరించారు.

Rajeev Kanakala
Jr NTR
Chandrababu
Arrest
TDP
  • Loading...

More Telugu News