Chandrababu: అలర్జీతో బాధపడుతున్న చంద్రబాబు... జైలుకి వెళ్లి పరిశీలిస్తున్న ప్రభుత్వ వైద్యులు

Doctors has been examining Chandrababu in Rajahmundry jail
  • స్కిల్ కేసులో చంద్రబాబుకు రిమాండ్
  • రాజమండ్రి జైలులో ఉన్న చంద్రబాబు
  • విపరీతమైన ఉక్కపోత, అధిక వేడిమితో చంద్రబాబుకు డీహైడ్రేషన్, అలర్జీ
  • రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రికి సమాచారం అందించిన జైలు అధికారులు

స్కిల్ కేసులో రాజమండ్రి సెంట్రల్ జైలులో జ్యుడిషియల్ రిమాండ్ ఖైదీగా ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబు అస్వస్థతకు లోనయ్యారు. గత కొన్నిరోజులుగా విపరీతమైన ఉక్కపోత, వేడిమి నెలకొని ఉండడంతో... జైల్లో చంద్రబాబు డీహైడ్రేషన్ తో బాధపడుతున్నారు. అధిక వేడిమితో ఆయన అలర్జీకి గురయ్యారు. ఈ నేపథ్యంలో, జైలు అధికారులు రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రి వర్గాలకు సమాచారం అందించారు. దాంతో, చంద్రబాబు ఆరోగ్య పరిస్థితిని పరిశీలించేందుకు వైద్యులు జైలులోకి వెళ్లారు. దీనిపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

  • Loading...

More Telugu News